నేను ఎవరికీ మద్దతివ్వడం లేదు
వచ్చే ఎన్నికల్లో తాను ఎవరికీ మద్దతివ్వడం లేదని సూపర్ స్టార్ రజనీకాంత్ సృష్టం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతితో ఆర్కేనగర్ నియోజకవర్గానికి ఏప్రిల్ 12న ఉప ఎన్నిక నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో పలు పార్టీలు తమ అభ్యర్థులను బరిలోకి దించాయి. అయితే ఈ స్థానానికి బిజెపి అభ్యర్థిగా పోటీచేస్తున్న సంగీత దర్శకుడు గంగై అమరన్ రజనీకాంత్‌ను కలిశారు. దీంతో రజనీ రాజకీయాల్లో వస్తున్నారని, బీజేపీకు మద్దతిస్తున్నారని వూహాగానాలు వెల్లువెత్తాయి. దీంతో ఈ విషయంపై రజనీకాంత్ స్పందిస్తూ రానున్న ఎన్నికల్లో నా మద్దతు ఎవరికీ ఉండదు అని ట్వీట్ చేశారు.






