ప్రగ్యాకు మరో అవకాశం!
ఇటీవలే ఓం నమో వేంకటేశాయ, గుంటూరోడు సినిమాలతో ప్రగ్యా జైస్వాల్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆమె నటించిన నక్షత్రం విడుదలకి సిద్ధమవుతుండగా, బోయపాటితో చేస్తోన్న సినిమా సెట్స్ పై వుంది. ఈ నేపథ్యంలో ఆమె మరో సినిమాలోనూ ఛాన్స్ కొట్టేసింది. మంచు విష్ణు కథానాయకుడిగా ఆచారి అమెరికా యాత్ర సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో కథానాయికగా ప్రగ్యాను తీసుకున్నారనేది తాజా సమాచారం. గ్లామర్ పరంగానే కాకుండా నటన పరంగా కూడా ఈ పాత్రకి ప్రాధాన్యత వుండటంతో, ప్రగ్యాను తీసుకున్నారని అంటున్నారు. బ్రహ్మానందం ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. కామెడీ ప్రధానాంశంగా నడిచే ఈ సినిమా విష్ణుకి ఎలాంటి హిట్ ను తెచ్చిపెడుతుందో చూడాలి.













