ప్లే బ్యాక్ టీజర్‌ను విడుదల చేసిన సుకుమార్
అర్జున్ కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ప్లే బ్యాక్. అనన్య నాయిక. హరి ప్రసాద్ జక్కా దర్శకుడు. ప్రసాద్‌రావు పెద్దినేని నిర్మాత. హైదరాబాద్‌లో ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కథ నాకు బాగా నచ్చింది. నేను తీయాలనుకున్న సినిమా ఇది. చిన్న సినిమాలు ఈ మధ్య కాలంలో బాగా ఆడుతున్నాయి. ఆ జాబితాలో ఈ చిత్రం కూడా చేరాలన్నారు. దర్శకుడు మాట్లాడుతూ 35 రోజుల్లోనే ఈ సినిమా పూర్తి చేశాం. అది కెమెరామెన్ బుజ్జి వల్లే సాధ్యమైంది. ఈ సినిమాని బాగా అర్థం చేసుకుని ఎడిటర్ నాగేశ్వర్‌రెడ్డి తీర్చిదిద్దారు. సుకుమార్‌తో నాది పాతికేళ్ల స్నేహం. తను ఈ చిత్రాన్ని ముందు నుంచీ ప్రోత్సహిస్తున్నాడన్నారు. సంగీత దర్శకుడు కమ్రాన్ మాట్లాడుతూ పాటలు బాగా వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు సూర్య ప్రతాప్, దినేశ్, డీజే మాస్టర్ కార్తికేయ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.













