న్యూయార్క్ టైమ్ స్క్వేర్ లో పవన్ జన్మదిన వేడుకలు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టిన రోజు వేడుకలను అభిమానులు, ఎన్నారై జనసైనికులు ఘనంగా నిర్వహించారు. అమెరికాలోని న్యూయార్క్ టైమ్ స్క్వేర్‌లో 150 అడుగుల ఎత్తు, 100 అడుగుల వెడల్పు ఉన్న తెరపై పవన్ చిత్రమాలికను ప్రదర్శించారు. సెప్టెంబరు 1, 2 తేదీల్లో ప్రతి 10 నిమిషాలకు ఓసారి 15 సెకన్ల పాటు ఆ పోటోలు కనువిందు చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు, టీమ్ జనసేన యూఎస్‌ఏ నాయకులు పనవ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత ఎన్నారై అభిమానులు కేక్ కోశారు. జనసైనికులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సరైన దిక్సూచి పవన్ అన్నారు.













