ఎన్టీఆర్ బైక్ మనీ బాలయ్య చేతికి
ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం జనతా గ్యారేజ్. ఈ సినిమా విడుదల సమయంలో చిత్రబృందం జనతా గ్యారేజ్ బైక్ కాంటెస్ట్ ను నిర్వహించింది. కాంటెస్ట్‌లో గెలుపొందిన నల్గొండకు చెందిన రాజ్ కుమార్ రెడ్డికి ఎన్టీఆర్, కొరటాల శివ ఆ బైక్ ని గిప్ట్గా ఇచ్చారు. అప్పుడు ఆ గిఫ్ట్ అందుకున్న అభిమాని సంతోషంతో ఊగిపోయాడు. ఈ కాంటెస్ట్ ద్వారా సమీకరించిన రూ.10 లక్షల నగదుని చిత్ర యూనిట్ బసవతారకరామ చారిటబుల్ ట్రస్ట్‌కి అందిస్తామని అన్నారు. అన్నట్టుగానే ఇప్పుడు ఆ మొత్తాన్ని దర్శకుడు కొరటాల శివ, నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కలిసి బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ చేతికి విరాళంగా అందించారు. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు కొరటాల శివ తదితరులు పాల్గొన్నారు.













