Aaya Sher: ఆయా షేర్ తో నాని రికార్డు
నాచురల్ స్టార్ నాని(nani)హీరోగా, కయాదు లోహర్(kayadhu lohar) హీరోయిన్గా, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల(Srikanth odela) తెరకెక్కిస్తున్న అవైటెడ్ మూవీ ది ప్యారడైజ్(the paradise) ఇప్పటికే భారీ అంచనాలు నెలకొల్పింది. అయితే సినిమా అనౌన్స్మెంట్ సమయంలో ఉన్న హైప్ ఒకలా ఉంటే, ఆయా షేర్(aaya sher) అనే ఫస్ట్ సాంగ్ విడుదలైన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్(anirudh ravichander) అందించిన ఎనర్జిటిక్ మ్యూజిక్కు నాని మాస్ స్టెప్పులు, స్టైల్ కలవడంతో ఈ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమా ఒక్కసారిగా నెక్స్ట్ లెవెల్ హైప్‌ను సొంతం చేసుకుంది.
కేవలం తెలుగులోనే రిలీజైన లిరికల్ సాంగ్‌కు పాన్ ఇండియా స్థాయిలో స్పందన రావడం విశేషం. విడుదలైన మొదటి 24 గంటల్లోనే టైర్-1 హీరోల సినిమాల్లాగా వ్యూస్, లైక్స్ సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. సోషల్ మీడియాలో కూడా ఈ పాటకు విపరీతమైన షేర్లు, రీల్స్ వచ్చాయి. ముఖ్యంగా నాని మాస్ గ్రేస్, అనిరుధ్ బీట్ల కలయిక ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఈ సాంగ్ యూట్యూబ్ ట్రెండ్స్ చార్ట్‌లో 158 గంటలకు పైగా ట్రెండింగ్‌లో కొనసాగడం దాని ప్రభావాన్ని స్పష్టంగా చూపిస్తుంది.
ఇదిలా ఉంటే ఆయా షేర్ సాంగ్ మరో అరుదైన రికార్డును కూడా నమోదు చేసింది. యూట్యూబ్‌లో 1 మిలియన్ లైక్స్‌ను అత్యంత వేగంగా అందుకుని, నాని కెరీర్లో ఫాస్టెస్ట్ అండ్ ఫస్ట్ ఎవర్ 1 మిలియన్ లైక్స్ సాధించిన లిరికల్ సాంగ్‌గా నిలిచింది. ఈ రికార్డు ద్వారా నాని మార్కెట్ పాన్ ఇండియా స్థాయిలో ఎంతగా విస్తరించిందో స్పష్టమవుతోంది. మొత్తంగా చూస్తే, ది ప్యారడైజ్ సినిమాపై ఉన్న అంచనాలను ఆయా షేర్ పాట మరింతగా పెంచి, విడుదలకు ముందే బలమైన బజ్‌ను క్రియేట్ చేసింది.
ఇవి కూడా చదవండి








