నా పేరు రాజా షూటింగ్ పూర్తి
రాజ్, సూర్యన్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం నా పేరు రాజా. ఈడో రకం అనేది ఉపశీర్షిక. ఆకర్షిక, నస్రీన్ కథానాయికలు. అశ్విన్కృష్ణ దర్శకుడు. రాజ్ సూర్యన్, కిరణ్‌రెడ్డి ప్రభాకర్‌రెడ్డి నిర్మాతలు. చిత్రీకరణ పూర్తయింది. అక్టోబరులో పాటల్ని విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం తెలిపింది. నిర్మాతలు మాట్లాడుతూ బలమైన కథతో తెరకెక్కుతున్న చిత్రమిది. యాక్షన్ ప్రధానంగా సాగుతుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ, కర్ణాటకల్లో చిత్రీకరణ జరిపాం. ఇటీవలే రాజా రాజా మన్మథ రాజా.. ఆజా ఆజా నా రాజా పాటని నృత్య దర్శకుడు నగేష్ నేతృత్వంలో తెరకెక్కించాం. సాహితీ సాహిత్యం సమకూర్చిన ఆ గీతాన్ని మోహన భోగరాజు పాడారు. ఆ పాట చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. నవంబరులో చిత్రాన్ని విడుదల చేస్తాం అన్నారు. ప్రభు సూర్య, ఆయుశ్రీ, ఇరాన్, అవా సపాయి, ఆరాధ్య తదితరులు నటించారు.













