పోస్ట్ ప్రొడక్షన్లో నా పేరు రాజా
ఆమోమ్ ఎంటర్ప్రైజెస్ పతాకంపై రాజ్ సూరియన్ హీరోగా ఆకర్షిక. నస్రీన్ హీరోయిన్లుగా ఆశ్విన్కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం నా పేరు రాజా..రాజ్ సూరియన్, ప్రభాకర్‌రెడ్డి, కిరణ్‌రెడ్డి నిర్మాతలు. తెలుగు, కన్నడ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం డబ్బింగ్, డిఐ కార్యక్రమలు జరుపుకుంటోంది. ఇది యాక్షన్, రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. నిర్మాతలు మాట్లాడుతూ ప్రస్తుతం డబ్బింగ్ జరుపుకుంటోందన్నారు. అతి త్వరలో పాటలు, సినిమాను విడదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ప్రభు సూర్య, ఆయుశ్రీ, ఇరాన్, సూపర్‌మోడల్ అవా సఫాయి. ఆరాధ్య తదితరులు నటిస్తున్నారు.













