“మిక్చర్ పొట్లం” సినిమా మేలో విడుదల
శ్వేతా బసుప్రసాద్ కీలక పాత్రలో గోదావరి సినీ టోన్ పతాకంపై ఎమ్‌వి సతీష్‌కుమార్ దర్శకత్వంలో కలపటపు శ్రీలక్ష్మీప్రసాద్, కంటే వీరన్న చౌదరి, లంకపల్లి శ్రీనివాసరావు సంయుక్తంగా అందిస్తున్న చిత్రం మిక్చర్ పొట్లం. జయంత్, గీతాంజలి జంటగా నటించిన సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ మేలో భారీఎత్తున సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని, చాలా రోజుల తర్వాత మాధవ పెద్ది సురేష్ ఈ చిత్రానికి సంగీతం అందించడం విశేషమని, లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన సినిమాలో యాక్షన్‌కు ప్రాధాన్యత ఉందని, శ్వేతాబసు చిత్రానికి హైలెట్‌గా ఉంటుందని తెలిపారు. భానుచందర్, సుమన్, కృష్ణభగవాన్, పోసాని కృష్ణమురళి తదితరులు నటించిన చిత్రానికి ఎమ్‌వి సతీష్‌కుమార్ దర్శకత్వం వహించారు.













