సమంత కం బ్యాక్ మూవీ వాయిదా
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు(Samantha Ruth Prabhu) కొంతకాలం విరామం తర్వాత మళ్లీ తెలుగు సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న సినిమా మా ఇంటి బంగారం(Maa Inti Bangaram) తాజాగా ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ట్రాలాలా పిక్చర్స్(Traalala Pictures) బ్యానర్‌పై స్వయంగా సమంత నిర్మించిన ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా, మే 15న విడుదల చేయాలని మొదట ప్లాన్ చేశారు. అయితే అనూహ్యంగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌ను నిలిపివేయడంతో పాటు విడుదలను కూడా వాయిదా వేసినట్లు అధికారికంగా ప్రకటించింది. దీంతో సమ్మర్ రేస్ నుంచి ఈ సినిమా తప్పుకోవడం విశేషంగా మారింది.
ఇవి కూడా చదవండి
సినిమా ప్రమోషన్స్ ప్రారంభమైనప్పటికీ ఆశించిన స్థాయిలో బజ్ రాకపోవడం ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ముఖ్యంగా ఐపీఎల్ సీజన్ థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్యపై ప్రభావం చూపుతుండటంతో, బాక్సాఫీస్ వద్ద రిస్క్ తీసుకోకూడదనే ఉద్దేశంతో రిలీజ్ ను వాయిదా వేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే స్థాయిలో హైప్ లేకపోవడం కూడా మేకర్స్‌ను ఆలోచనలో పడేసింది.
డైరెక్టర్ నందినీ రెడ్డి(Nandini Reddy) తెరకెక్కించిన ఈ సినిమాకు కథను రాజ్ కుమార్(Raj Nidimoru) అందించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాకు నాన్ థియేట్రికల్ హక్కులు ఇప్పటికే మంచి ధరలకు అమ్ముడైనట్లు సమాచారం. ప్రస్తుతం జూలైలో కొత్త రిలీజ్ డేట్‌ను పరిశీలిస్తున్న మేకర్స్, సరైన టైమ్ చూసుకుని మళ్లీ ప్రమోషన్స్ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. దీంతో సమంత రీఎంట్రీపై ఫ్యాన్స్‌లో ఆసక్తి కొనసాగుతోంది.








