ఆర్థిక ఇబ్బందుల్లో మరో నటి
కృష్ణవంశీ తీసిన ఖడ్డం సినిమా గుర్తుందా? శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, రవితేజ నటించారందులో. ఆ సినిమాలో ఓ బాలీవుడ్ నటి కూడా నటించింది. ఆమె కిమ్ శర్మ. కొన్నాళ్లు క్రికెటర్ యువరాజ్ సింగ్తో ప్రేమాయాణం కూడా నడిపింది. బాలీవుడ్ లో కూడా అనేక సినిమాలు చేసింది. హఠాత్తుగా ఎవరికీ చెప్పకుండా ఓ కెన్యా వ్యాపారిని పెళ్లి చేసుకుని ఆ దేశానికే వెళ్లిపోయింది. అప్పట్లో కిమ్ శర్మని ఆమె భర్తని చూసి అంతా అవాక్కయ్యారు కూడా. మల్లెపూవులా ఉండే కిమ్ నల్లగా, లావుగా ఉన్న ఓ కెన్యా దేశీయుడిని ఎలా పెళ్లిచేసుకుందని సందేహించారంతా. అతనికి ఉన్న వేల కోట్ల రుపాయలను చూసే కిమ్ పెళ్లి చేసుకుందని కూడా అన్నారు. వీరిద్దరికీ పిల్లలు కూడా లేరు. కాగా కిమ్ భర్త ఈ మధ్యలో మరో మహిళా మోజుల పడ్డాడట. కిమ్ ని పట్టించుకోవడం మానేశాడట. దీంతో వీరిద్దరి దూరం బాగా పెరిగిపోయిందట. ఇక భర్త దగ్గర ఉండలేక ఇండియా వచ్చేసిందట కిమ్. ఒంటరిగా ముంబైలోనే ఉంటోంది. వస్తున్నప్పుడు భర్త దగ్గర నుంచి ఏమీ తెచ్చుకోలేదు కిమ్. దీంతో ఆర్థికంగా చాలా కష్టాల్లో ఉందని సమాచారం. అందుకోసమే తిరిగి నటించడానికి సిద్ధమవుతోందట. కేవలం సంపాదన కోసమే ఆమె తిరిగి సినిమాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తోందట. కాస్త సంపాదించుకుని వ్యాపారంలోకి దిగాలని చూస్తోంది. అన్నీ అమె అనుకున్నట్లుగా జరిగితే తిరిగి కిమ్ సినిమాల్లో మెరవడం ఖాయం. చూడాలి తెలుగు దర్శకులు ఆమెకు ఏ మేరుకు అవకాశాలు ఇస్తారో.













