ఫస్ట్ యానివర్సరీ సెలెబ్రేషన్స్ లో కత్రీనా..
బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన కత్రీనా కైఫ్ ఇప్పటికీ తన ఫామ్ ని కొనసాగిస్తుంది. తన సినిమా కెరీర్ లో ఎన్నో లవ్ స్టోరీస్ ని నడిపిన కైఫ్ తాజాగా టాలెంటెడ్ బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. గత ఏడాది డిసెంబర్ 9 న ఫ్యామిలీ మెంబర్స్, కొద్ది మంది సెలెబ్రేటిస్ మధ్యన వారి పెళ్లి జరిగింది.
ఈ ప్రేమజంట కొద్ది రోజులలో తమ మొదటి పెళ్లి రోజుని జరుపుకోనున్నారు .ఫస్ట్ యానివర్సరీ ని చాలా గ్రాండ్ గా చేసుకోవడానికి ప్లాన్ చేసుకున్నారు అని సన్నిహితులు తెలిపారు. అయితే సైలెంట్ గా ఈ జంట సెలెబ్రేషన్స్ ని పక్కన పెట్టేసి మాల్దీవ్స్ చెక్కేశారు. తమ యానివెర్సరీ సెలెబ్రేషన్స్ విక్కీ , కైఫ్ మాల్దీవ్స్ లో ప్లాన్ చేస్తున్నారట.
ప్రెజెంట్ అంతా మాల్దీవ్స్ ట్రెండ్ నడుస్తుంది. స్టార్ హీరోల దగ్గరి నుండి సెలెబ్రేటిస్ అందరు హాలిడే స్పాట్ గా మాల్దీవ్స్ ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. అక్కడి బీచెస్ లో ఫొటోస్ ని షేర్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇదంతా మనం సోషల్ మీడియా లో చూస్తూనే ఉన్నాం. అయితే ఇపుడు ఈ జంట కూడా మాల్దీవ్స్ బాట పట్టారు.
భర్త విక్కీ తో ఫుల్ సైడ్ ఫొటోస్ షేర్ చేస్తూ కైఫ్ తన ఫాన్స్ ని అలరిస్తుంది. క్యాట్,విక్కీ పెయిర్ చాలా బాగుంది అని ఫాన్స్ సంబరపడుతున్నారు. ఇద్దరు తమ తమ కెరీర్ లలో బిజీగా ఉండగా, రీసెంట్ గా కత్రినా ” ఫోన్ బూత్ ” సినిమాని చేసింది. మరో రెండు సినిమాలు చేతిలో ఉన్నట్టు తెలుస్తుంది.
విక్కీ కౌశల్ కూడా వరుస విజయాలతో దూసుకెళ్తున్న తరుణంలో ఆఫ్ స్క్రీన్ మీదే కాకుండా, ఆన్ స్క్రీన్ పైన కూడా ప్రేక్షకులని మెప్పించాలని చూస్తున్నారు. ..













