ఆ నటి భర్తకు పెళ్లైపోయింది
బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ మాజీ భర్త సంజయ్ కపూర్ తన ప్రియురాలు ప్రియా సచ్దేవ్ను పెళ్లాడారు. ఢిల్లీలో వీరి వివాహం జరిగింది. ఈ కార్యక్రమానికి వధూవరుల కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఈ జంట మరోసారి న్యూయార్క్‌లో పెళ్లి చేసుకోబోతోంది. కొన్నేళ్ల క్రితం ప్రియా సచ్దేవ్తో సంజయ్ కపూర్‌కు న్యూయార్క్‌లో పరిచయం అయింది. గత ఐదేళ్లుగా వీరి బంధం కొనసాగుతోంది. సంజయ్‌కు ఇది మూడో పెళ్లి కాగా, ప్రియకు ఇది రెండో పెళ్లి. గతంలో సంపన్నుడైన విక్రమ్ చత్వాల్ను ప్రియా పెళ్లాడింది. ఆ తరువాత వీరి వివాహ బంధం ముగిసింది. సంజయ్ కూడా గత ఏడాది కరిష్మాతో విడాకులు తీసుకున్నాడు. దీంతో 13 ఏళ్ల వీరి బంధానికి తెరపడింది. మరో వైపు కరిష్మా కపూర్ కూడా వ్యాపారవేత్త సందీప్ తోష్నీవాల్తో సన్నిహితంగా ఉంటోందన్న వార్తలు హల్చల్ చేస్తున్నాయి.













