కరిష్మా కపూర్ రెండో పెళ్లికి గ్రీన్ సిగ్నల్
చిన్ననాటి స్నేహితుడు సంజయ్ కపూర్‌తో పదమూడేళ్ల వివాహ బంధానికి గత ఏడాది ముగింపు పలికింది బాలీవుడ్ నటి కరిష్మాకపూర్. మనస్పర్థల కారణంగా అతడి నుంచి విడాకులు తీసుకుంది. తాజా సమాచారం ప్రకారం కరిష్మా రెండో వివాహానికి సిద్ధమైనట్లు సమాచారం. గత కొంతకాలంగా వ్యాపారవేత్త సందీప్ తోష్నివాల్‌తో ఆమె ప్రేమలో ఉన్నట్లు త్వరలోనే అతడిని పెళ్లాడబోతున్నట్లు చెబుతున్నారు. వీరి పెళ్లికి కరిష్మాకపూర్ కుటుంబ సభ్యులు సుముఖతను వ్యక్తం చేసినట్లు తెలిసింది. తొందరలోనే వీరి పెళ్లిని జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. సందీప్ తోష్నివాల్కు ఇదివరకే పెళ్లయింది. ప్రస్తుతం ఆయన భార్యకు దూరంగా వుంటున్నారు.













