‘కనబడుట లేదు’ చాలా బాగా కనిపిస్తోంది
సునీల్, సుక్రాంత్ వీరెల ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కనబడుట లేదు. బాలరాజు ఎం. దర్శకత్వంలో ఎస్.ఎస్. ఫిల్మస్, శ్రీపాద క్రియేషన్స్, షేడ్ స్టూడియోస్ బ్యానర్స్‌పై సాగర్ మంచనూర్, సతీష్ రాజు, దిలీప్ కూరపాటి, డా.శ్రీనివాస్ కిషన్ అనపు, దేవీ ప్రసాద్ బలివాడ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 13న ఈ చిత్రం విడుదలవుతున్న సందర్భంగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, స్టార్ రైటర్ విజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరై బిట్ టిక్కెట్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా రామ్‌గోపాల్ వర్మ కనబడుట లేదు చిత్రం చాలా బాగా కనిపిస్తోంది. కొత్త దర్శకుడిలా బాలరాజు కనపడటం లేదు. తనెందుకు ఈ టైటిల్ పెట్టాడనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే అని తెలిపారు. డైరెక్టర్ బాలరాజు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే చిత్రమిది. ఈ చిత్రం ఈనెల 13న ప్రేక్షకుల ముందుకు రానుంది అన్నారు. నిర్మాత సాగర్ మంచనూర్ మాట్లాడుతూ దర్శకుడు బాలరాజు ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. సునీల్, వైశాలి, సుక్రాంత్ చాలా బాగా నటించారు. ఈ సినిమా విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైశాలి, సుక్రాంత్, అరుణ్ అదిత్, స్వప్న తదితరులు పాల్గొన్నారు.













