పార్లమెంటులో దంగల్ ప్రదర్శన
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన దంగల్ సినిమాను పార్లమెంటులోని జీఎంసీ బాలయోగి ఆడిటోరియంలో ప్రదర్శించనున్నారు. లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కోరిక మేరకు ఈ సినిమా ప్రదర్శనకు ఏర్పాట్లు చేశారు. దీనితో పార్లమెంటు ఎగువ సభ, దిగువ సభ సభ్యులను కుటుంబ సమేతంగా వచ్చి సినిమా చూడాలని స్పీకర్ ఆహ్వానించారు. ఈ నెల 23న ఈ సినిమాను బాలయోగి ఆడిటోరియంలో పార్లమెంటు సభ్యుల కోసం ప్రదర్శించనున్నారు. మహిళా సాధికారత, హక్కులపై అవగాహన కల్పించేందుకు ఈ సినిమా ఎంతో సహాయపడుతుందని భావించడంతో దీని ప్రదర్శనకు కోరానని అమె అన్నారు. ఇద్దరు ఆడప్లిలలను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ఒక తండ్రి పడిన కష్టమే దంగల్ సినిమా అన్న సంగతి తెలిసిందే.













