ఓ ఇంటి వాడైన బెల్లంకొండ శ్రీనివాస్
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Sreenivas) తన వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. ఆయన కావ్య రెడ్డి(Kavya Reddy)తో నిన్న రాత్రి తిరుపతిలో నిరాండబరంగా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. కుటుంబ సభ్యులు, సన్నిహిత మిత్రుల సమక్షంలో జరిగిన ఈ పెళ్లి ప్రశాంత వాతావరణంలో జరిగింది. సినీ ఇండస్ట్రీలో పెద్దగా హడావిడి లేకుండా నిర్వహించిన ఈ వేడుకలో సన్నిహితులకు మాత్రమే ఆహ్వానం ఇచ్చినట్లు సమాచారం. వివాహం అనంతరం మే 1న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్‌ను నిర్వహించనున్నారు.
ఈ రిసెప్షన్‌కు టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ తారలు, దర్శకులు, నిర్మాతలు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బెల్లంకొండ శ్రీనివాస్ స్వయంగా పలువురు ప్రముఖులను ఆహ్వానించినట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. వివాహ వేడుకను ప్రైవేట్‌గా ఉంచిన కుటుంబం, రిసెప్షన్‌ను మాత్రం అట్టహాసంగా జరపాలని నిర్ణయించుకోవడం విశేషం. ఈ ఈవెంట్ టాలీవుడ్లో ప్రముఖ గ్యాదరింగ్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇక కెరీర్ విషయానికి వస్తే, బెల్లంకొండ శ్రీనివాస్ గత సంవత్సరం కిష్కిందపురితో మంచి కమ్‌బ్యాక్ సాధించగా, తాజాగా టైసన్ నాయుడు సినిమా షూటింగ్‌ను పూర్తి చేశారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం మరికొన్ని ఆసక్తికర ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఆయన, వివాహ రిసెప్షన్ అనంతరం కొంత విరామం తీసుకుని జూన్‌లో తిరిగి షూటింగ్లలో పాల్గొననున్నట్లు సమాచారం. వ్యక్తిగత జీవితం, కెరీర్ రెండింటినీ సమతుల్యం చేస్తూ ముందుకు సాగుతున్న ఈ హీరోకు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇవి కూడా చదవండి








