ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని వివాహానికి ఆహ్వానించిన హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్
హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డిగారిని కలసి తన వివాహానికి ఆహ్వానించారు. తన కుటుంబ సభ్యులతో కలిసి వివాహ పత్రికను అందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇటీవలే బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డి నిశ్చితార్థం జరిగింది. వీరి వివాహ వేడుక ఏప్రిల్ 29న దివ్యమైన తిరుమలలో ఘనంగా జరగనుంది.








