పూరీకి నో చెప్పిన బాలయ్య!
అదేంటి నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం చేస్తున్న 101వ సినిమాకు పూరీ జగన్నాథ్ డైరెక్టర్ కదా. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ కూడా సగం పూర్తయిపోయింది కదా. మరి పూరీకీ అవకాశం ఇవ్వకపోవడం ఏంటి? అనుకుంటున్నారా? వందో సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి సంచలనం విజయం తర్వాత 101వ సినిమాగా కృష్ణవంశీ దర్శకత్వంలో రైతు చేయాలనుకున్నాడు బాలయ్య. అయితే ఓ ముఖ్య పాత్రకు అనుకున్న అమితాబ్ నో చెప్పడంతో ఆ సినిమా ఆగిపోయింది. వెంటనే మంచి కథ చెప్పిన పూరీ జగన్నాథ్ బాలయ్యను ఆకట్టుకున్నాడు. దీంతో పూరీకీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశాడు బాలయ్య. అయితే ఈ సినిమా తన స్వీయ నిర్మాణంలో తెరకెక్కిద్దామనుకున్నాడట పూరీ. ఈ సినిమాను తాను నిర్మిస్తానని బాలయ్యకు చెప్పాడట. అందుకు బాలయ్య అంగీకరించలేదట. ముందుగానే ఒప్పందం కుదుర్చుకున్న భవ్య క్రియేషన్స్‌కే ఈ సినిమా చేయాలని చెప్పాడట. మరో మూడేళ్ల తర్వాత నిర్మాణం చేపట్టే అవకాశం ఇస్తానని పూరీకి మాటిచ్చాడట బాలయ్య. అలా 101 సినిమాను నిర్మించే అవకాశం రాలేదట.













