ఎక్కువ రిలీజులు కూడా ప్రమాదమా?
తమిళ స్టార్ హీరో ధనుష్(Dhanush) ఇటీవల వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించడమే కాకుండా, డైరెక్టర్ గా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే ఆయన తాజా సినిమా కర(Kara) బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ఈ సినిమా కనీస ఓపెనింగ్స్ కూడా సాధించకపోవడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. గత దశాబ్దంలో స్టార్‌గా ఎదిగిన తర్వాత ధనుష్‌కు ఇంత తక్కువ స్థాయి ఓపెనింగ్ రావడం ఇదే మొదటిసారి. ఇప్పటివరకు ఆయన నటించిన సినిమాలు కనీస స్థాయి ఓపెనింగ్స్‌ను అందుకోవడంలో విఫలమవ్వలేదు.
గతేడాది కుబేర(Kuberaa), ఇడ్లీ కడై(Idli Kadai), తేరే ఇష్క్ మేన్(Tere Ishk Mein) వంటి మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ధనుష్, వాటితో డీసెంట్ హిట్స్ అందుకున్నారు. అయినప్పటికీ కర నిరాశపరిచిన ఓపెనింగ్ రావడం ఆశ్చర్యంగా మారింది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, వరుసగా సినిమాలు రిలీజ్ చేయడం వల్ల ప్రేక్షకుల్లో ఎక్సైట్మెంట్ తగ్గడం ప్రధాన కారణంగా కనిపిస్తోంది. కంటెంట్ బలహీనత కూడా ఈ ఫలితానికి కారణమైందని అంటున్నారు.
ఇక ముందున్న ప్రాజెక్టుల విషయానికి వస్తే, ధనుష్ ప్రస్తుతం D55(డైరెక్టర్ రాజ్‌కుమార్ పెరియసామి(Rajkumar Periyasamy) మరియు D56 (డైరెక్టర్ తమిజరాసన్ పచ్చముచ్చు) సినిమాల్లో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలూ ఈ ఏడాదే రిలీజ్ కానున్నాయి. అలాగే D57ను మారి సెల్వరాజ్(Mari Selvaraj) తెరకెక్కించనుండగా, త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. అదనంగా వడ చెన్నై(Vada Chennai2) కూడా లైన్లో ఉంది. అయితే వరుస రిలీజ్‌ల స్ట్రాటజీని కంటిన్యూ చేస్తే, ఫ్యూచర్ లో కూడా ఇలాంటి ఫలితాలు రావచ్చని ట్రేడ్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.








