తెలుగు చలనచిత్ర జాతీయ అవార్డులను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
తెలుగు చలనచిత్ర జాతీయ అవార్డులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. 2012, 2013 సంవత్సరాలకు ఎన్టీఆర్, రఘుపతివెంకయ్య, బీఎన్‌రెడ్డి, నాగిరెడ్డి-చక్రపాణి జాతీయ చలన చిత్ర పురస్కారాలను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. సినీ రంగంలో విశిష్ట సేవలందించినందుకు ఇచ్చే నందమూరి తారకరామారావు జాతీయ పురస్కారం (2012)కి ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎంపికయ్యారు. సినీ నటులు బాలకృష్ణ, మురళీమోహన్ అవార్డు గ్రహీతలను ప్రకటించారు. ఈ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ 2014, 2015, 2016 సంవత్సరాలకు సంబంధించిన చలనచిత్ర పురస్కారాలను త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపారు. ఈ ఐదేళ్ల అవార్డులను ఒకేసారి ప్రదానం చేయనున్నట్లు ఆయన వివరించారు.
అవార్డు గ్రహీతల వివరాలు:
ఎన్టీఆర్ జాతీయ చలనచిత్ర పురస్కారం 2012 – ఎస్పీ బాలసుబ్రమణ్యం
ఎన్టీఆర్ జాతీయ చలనచిత్ర పురస్కారం 2013- హేమమాలిని
బీఎన్‌రెడ్డి పురస్కారం 2012- సింగీతం శ్రీనివాసరావు
బీఎన్‌రెడ్డి పురస్కారం 2013- కోదండరామిరెడ్డి
రఘుపతి వెంకయ్య అవార్డు 2012- కోడిరామకృష్ణ
రఘుపతి వెంకయ్య అవార్డు 2013- వాణిశ్రీ
నాగిరెడ్డి-చక్రపాణి జాతీయ చలన చిత్ర పురస్కారం 2012- డీ సురేశ్‌బాబు
నాగిరెడ్డి-చక్రపాణి జాతీయ చలన చిత్ర పురస్కారం 2013- దిల్ రాజు













