కాక పుట్టించిన అమీ జాక్సన్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-10 సీజన్‌కు అట్టహాసంగా తెరలేచింది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ప్రత్యేకంగా రూపొందించిన లేజర్ షో ద్వారా ఈ 10వ సీజన్ ఐపీఎల్‌కు తెరలేచింది. తెలంగాణ రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబిచేలా వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో బాలీవుడ్ నటి అమీ జాక్సన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మిరుమిట్లు గొలిపే విద్యుత్ వెలుగుల మధ్య ఓపెన్ టాప్ వాహనంలో మైదానంలోకి వచ్చిన అమె, ఆధునిక వస్త్రధారణలో తన అందచందాలతో అభిమానులను మైమరపించింది. కాలాక్ష్మ, దమ్మాదమ్మా గీతాలకు నృత్యం చేసి హోయలు పోయింది. మరిన్ని బాలీవుడ్ గీతాలకు తనదైన శైలిలో స్టెప్పులు వేసి అభిమానుల్ని అలరించింది.













