సంచలన నిర్ణయం తీసుకున్న అక్కినేని అమల
నటి అమల ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఒకప్పుడు టాలీవుడ్లో అగ్రశ్రేణి నటిగా కొనసాగిన అమల ఆ తర్వాత నాగార్జున వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత నటనకు పులిస్టాప్ పెట్టారు. జంతు ప్రేమికురాలిగా బ్లూ క్లాస్ నిర్వహకురాలిగా సమాజసేవలో నిమగ్నమయ్యారు. చాలా విరామం తర్వాత అమల లైఫ్ ఈజ్ బ్యూటిపుల్ అనే చిత్రం ద్వారా పున:ప్రవేశం చేశారు. ఆ చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల కోరిక మేరకు తిరిగి నటించారు. అయితే ఈ చిత్రంలో అమల పాత్ర పట్ల నాగార్జున సైతం అసంతృప్తిని వ్యక్తం చేశారు. అలాగే సినిమా సైతం బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. అమల మళ్లీ నటిస్తుందని తెలియడంతో ఇతర భాషల నుండి అమెకు అవకాశాలు వచ్చాయి. బాలీవుడ్లో హమారి ఆదూరీ కహాని, మళయాలంలో సైరాబాను చిత్రాల్లో నటించింది. ఈ సినిమాలన్నీ కనీస విజయాన్ని చేరుకోలేకపోయాయి. కథల ఎంపికలో వైఫల్యమో ఏమో కానీ అమల రీ ఎంట్రీ నిరాశపరిచింది. దీంతో అమల ఇక ముందు నటించకూడదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఏకైక కుమారుడు అఖిల్ కెరీప్పౖెె దృష్టి పెట్టాలని, అలాగే బ్లూక్రాస్ సేవలు కొనసాగించాలని నిర్ణయించున్నట్టు సమాచారం.













