అమలా పాల్ మరో సాహసం
పాత్రల విషయంలో సాహసాలు చేసే కథానాయికగా అమలాపాల్కి పేరుంది. కెరీర్ ఆరంభంలోనే ఆమె చేసిన కొన్ని పాత్రలు అప్పట్లో చర్చనీయాంశంగా మారాయి. తాజాగా మరో సాహసం చేసిందామె. తమిళంలో ఆడై పేరుతో తెరకెక్కిన చిత్రంలో అమలా పాల్ నగ్నంగా నటించింది. తెలుగులో ఆమె పేరుతో విడుదల కానున్న ఆ సినిమా టీజర్ ఇటీవలే విడుదలైంది. అందులో అమలా పాల్ కనిపించిన విధానం ఆసక్తి రేకెత్తిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో ఆ టీజర్ గురించి, అమలాపాల్ నటన గురించి చర్చ సాగుతోంది. అదృశ్యమైన ఓ అమ్మాయి చుట్టూ సాగే కథతో ఈ చిత్రం తెరకెక్కించినట్టు తెలుస్తోంది. రత్నకుమార్ దర్శకత్వం వహించారు.













