15 ఏళ్ళ రికార్డు బద్దలు కొట్టిన రింకు..!
ఐపీఎల్ 2026 సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) స్టార్ ఫినిషర్ రింకూ సింగ్(Rinku Singh) ఒక సంచలన ఇన్నింగ్స్‌తో చరిత్ర సృష్టించాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో(LSG) జరిగిన మ్యాచ్‌లో రింకూ మెరుపు దాడి చేసి, టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ(MS Dhoni) పేరిట ఉన్న 15 ఏళ్ల నాటి ఒక అరుదైన రికార్డును అధిగమించాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక స్కోరు సాధించిన బ్యాటర్‌గా రింకూ ఇప్పుడు ఐపీఎల్ చరిత్రలో అగ్రస్థానానికి చేరుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో రింకూ సింగ్ కేవలం 51 బంతుల్లోనే 7 ఫోర్లు, 5 సిక్సర్ల సహాయంతో 83 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఒక దశలో కష్టాల్లో ఉన్న కేకేఆర్‌ను ఆదుకోవడమే కాకుండా, సునీల్ నరైన్‌తో కలిసి 62 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వీరిద్దరి పోరాటంతోనే కోల్‌కతా జట్టు స్కోరు 150 పరుగుల మార్కును దాటగలిగింది. ఒత్తిడి సమయంలో రింకూ చూపిన తెగువకు అభిమానులు ఫిదా అయిపోయారు. ఇన్నాళ్లూ ఈ రికార్డు ఎంఎస్ ధోనీ పేరిట ఉండేది.
2011 ఐపీఎల్ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ధోనీ, 40 బంతుల్లో 70 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దాదాపు 15 ఏళ్ల పాటు ఏ బ్యాటర్ కూడా ఆరో స్థానంలో వచ్చి ఈ స్థాయి స్కోరును నమోదు చేయలేకపోయారు. తాజాగా రింకూ సింగ్ 83 పరుగులతో ఆ రికార్డును అధిగమించి, ఐపీఎల్ చరిత్రలో ‘బెస్ట్ ఫినిషర్’ హోదాకు కొత్త అర్థాన్ని ఇచ్చాడు. రింకూ సింగ్ సాధించిన ఈ ఘనతపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది.
ఇవి కూడా చదవండి








