Telangana: వృద్ధులకు రక్షణ కవచం.. తెలంగాణ అసెంబ్లీలో చారిత్రాత్మక బిల్లుకు ఆమోదం!
Telangana: వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే పిల్లలకు కఠిన హెచ్చరికలు జారీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ‘తల్లిదండ్రుల సంరక్షణ – ఉద్యోగుల బాధ్యత’ బిల్లుకు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో ప్రసంగిస్తూ ఉద్వేగభరిత వ్యాఖ్యలు చేశారు.
బాధ్యత మరిచిన పిల్లలు: తమ సర్వస్వాన్ని ధారపోసి పిల్లలను పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను, రెక్కలు వచ్చాక పట్టించుకోకపోవడం దురదృష్టకరమని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి వారికి అండగా నిలిచేందుకే ఈ చట్టం తెచ్చామని స్పష్టం చేశారు.
కేంద్ర చట్టం కన్నా మిన్నగా: 2007 నాటి కేంద్ర చట్టం ప్రకారం తల్లిదండ్రులకు నెలకు రూ.10 వేల కంటే ఎక్కువ ఇచ్చే అవకాశం లేదని, కానీ ప్రస్తుత అవసరాలకు అది సరిపోదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి
ప్రజాప్రతినిధులకూ వర్తిస్తుంది: ఈ చట్టం కేవలం ప్రభుత్వ ఉద్యోగులకే పరిమితం కాదని, ప్రజాప్రతినిధులకు కూడా వర్తిస్తుందని సీఎం ప్రకటించారు.
సామాజిక బహిష్కరణ: తల్లిదండ్రుల యోగక్షేమాలు చూడలేని వ్యక్తులు సమాజంలో బతకడానికి వీల్లేదని, అటువంటి వారిని సామాజికంగా బహిష్కరించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రేమానురాగాలకు సంబంధించిన అంశంపై చట్టం తీసుకురావాల్సి రావడం బాధాకరమన్నారు.
ఇవి కూడా చదవండి








