Kodangal : రెవెన్యూ డివిజన్ గా కొడంగల్ .. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
కొడంగల్ (Kodangal) ప్రాంత సమగ్ర అభివృద్ధిలో భాగంగా డివిజన్ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. డివిజన్ ఏర్పాటుతో వెనకబడిన కొడంగల్ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతం నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలు రెండు జిల్లాల్లో కొనసాగడంతో ఒకే జిల్లాలో ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ ను రెవెన్యూ డివిజన్ గా (Revenue Division) ఏర్పాటు చేసేందుకు పరిశీలించాలని అధికారులకు సూచించినట్లు సమాచారం. దీంతో కొడంగల్ ప్రాంతం డివిజన్ ఏర్పాటుతో రూపురేఖలు మారనున్నాయి. మొదటగా కొడంగల్ ను జిల్లా (District)గా ఏర్పాటు చేయాలని భావించినా డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృతనిశ్ఛయంతో ఉన్నట్లు తెలుస్తుంది. విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో వెనకబడిన కొడంగల్ ను ప్రణాళికబద్ధంగా అభివృద్ధితో ముందుకు తీసుకెళ్లేందుకు సీఎం ఫోకస్ పెట్టారు. డివిజన్ ఏర్పాటుపై ఇప్పటికే అధికారులతో సమీక్ష నిర్వహించి ఆదేశాలు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి








