Kodangal: కొడంగల్ బడుల్లో అక్షయ పాత్ర భోజనం
                                    కొడంగల్ (Kodangal) అసెంబ్లీ నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందించేందుకు అక్షయ పాత్ర ఫౌండేషన్ (Akshaya Patra Foundation) ముందుకు వచ్చింది. గత డిసెంబరు నుంచి అక్షయ పౌండేషన్ ఈ నియోజకవర్గంలోని 312 పాఠశాలల్లో వేలమంది విద్యార్థులకు ప్రతిరోజూ ఉదయాన్నే అల్పాహారం అందిస్తున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా మధ్యాహ్న భోజనాన్ని కూడా సరఫరా చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే సంగారెడ్డి, రంగారెడ్డి (Ranga Reddy) , నారాయణపేట, మహబూబ్‌నగర్, వికారాబాద్ జిల్లాల్లో వందల పాఠశాలలకు మధ్యాహ్న భోజనాన్ని సరఫరా చేస్తున్న అక్షయ పాత్ర ఇక నుంచి కొడంగల్ నియోజకవర్గం మొత్తం అందించనుంది. సీఎస్ఆర్ నిధులతో ఈ పథకం అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు ఫౌండేషన్ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ని కలిశారు. ఈ నెల 14వ తేదీన కొడంగల్ సమీపంలోని ఎన్కేపల్లిలో రెండెకరాల విస్తీర్ణంలో నిర్మింతలపెట్టిన గ్రీన్ ఫీల్డ్ కిచెన్ శంకుస్థాపనకు రావాలని వారు రేవంత్‌రెడ్డిని ఆహ్వానించారు.







