Davos: దావోస్ లో తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్ ప్రారంభ కార్యక్రమం
దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశంలో తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్ (టీఏఐహెచ్) ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో నిర్వహిస్తున్నారు. ఏఐ ఆవిష్కరణలను వేగవంతం చేయడానికి ప్రత్యేకంగా రూపొందించిన స్వతంత్ర సంస్థగా టీఏఐహెచ్ పని చేస్తుందని.. ఇది ప్రపంచంలోనే తొలి ఏఐ ప్రయోగ వేదికగా నిలుస్తుందని ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడిరచింది. నాలుగు వ్యూహాత్మక స్తంభాలైన టాలెంట్ ఫౌండ్రీ, ఇన్నోవేషన్ ఇంజిన్, క్యాపిటల్ ఫ్లైవీల్, ఇంపాక్ట్ ల్యాబ్స్‌పై పనిచేస్తుందని తెలిపింది. ఏఐ క్వాంటమ్ కంప్యూటింగ్, చిప్ డిజైన్ వంటి డీప్‌టెక్ రంగాల్లో నూతన ఆవిష్కరణలకు చోదక శక్తిగా పని చేసేలా టీఏఐహెచ్ను రూపొందించారు. డీప్-టెక్ భవిష్యత్తుకు స్వాగతం పలికేలా తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న ఇన్నోవేషన్-ఫస్ట్ దృక్పథాన్ని ఈ ప్రారంభ కార్యక్రమంలో ప్రదర్శించనున్నట్టు తెలిపింది. తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్ అధికారిక ప్రారంభ కార్యక్రమం ఈ నెల 20న సాయంత్రం 7 గంటల నుండి 8:30 వరకు దావోస్‌లో మౌంటేన్ ప్లాజా హోటల్లో జరగనున్నది






