Allu Arjun: అల్లు అర్జున్-సందీప్ రెడ్డి వంగా ప్రాజెక్టు పై లేటెస్ట్ అప్డేట్
పుష్ప(Pushpa) ఫ్రాంచైజ్ సినిమాల తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) మార్కెట్ విపరీతంగా పెరిగిపోయింది. అతనితో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. కానీ బన్నీ(Bunny) మాత్రం పుష్ప సినిమాలతో వచ్చిన క్రేజ్ ను కాపాడుకోవాలని చాలా జాగ్రత్తగా సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ(Atlee) దర్శకత్వంలో బన్నీ సినిమా చేస్తున్నాడు.
అట్లీ తర్వాత బన్నీ ఏ డైరెక్టర్ తో వర్క్ చేయనున్నాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే పుష్ప2 తర్వాత బన్నీ హీరోగా సందీప్ రెడ్డి వంగా(Sandeep reddy Vanga) దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుందని టీ సిరీస్( T series) అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా తమిళ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకుడిగా అల్లు అర్జున్ హీరోగా కూడా ఒక ప్రాజెక్టు అనౌన్స్మెంట్ జరిగింది.
లోకేష్ మూవీ అనౌన్స్మెంట్ వచ్చాక సందీప్ తో సినిమా ఆగిపోయిందా? అసలు ఆ ప్రాజెక్టు ఉందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. కానీ తాజాగా ఆ ప్రాజెక్టుపై ఓ అప్డేట్ వినిపిస్తోంది. అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీతో చేస్తున్న సినిమా అయిపోయాక తర్వాత చేసేది సందీప్ డైరెక్షన్ లోనే అని, 2027 మే నుంచి ఆ సినిమా సెట్స్ పైకి వెళ్తుందని తెలుస్తోంది. స్పిరిట్ తర్వాత సందీప్ చేసే సినిమా కూడా బన్నీ తో అని సమాచారం. కాబట్టి బన్నీ- వంగా ప్రాజెక్టు ఉంటుందా లేదా అనుమానాలను పెట్టుకోనక్కర్లేదు.






