Mega158: చిరూ-బాబీ మూవీకి ముహూర్తం ఫిక్స్?
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తాజా సినిమా మన శంకరవరప్రసాద్ గారు(Mana Shankaravaraprasad Garu) సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో రఫ్ఫాడిస్తుంది. అనిల్ రావిపూడి(Anil ravipudi) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నయనతార(nayanthara) హీరోయిన్ గా నటించగా, విక్టరీ వెంకటేష్(Venkatesh) కీలక పాత్రలో నటించాడు. ఈ కాంబినేషన్ లో వచ్చిన సినిమాకు ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు.
మొత్తానికి ఈ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న చిరంజీవి తన తర్వాతి సినిమాను బాబీ కొల్లి(Bobby kolli) దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. చిరూ కెరీర్లో 158వ సినిమాగా రానున్న ఈ ప్రాజెక్టు ఆల్రెడీ అధికారికంగా అనౌన్స్ కూడా అయింది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఎప్పుడు మొదలవనుందనేది తెలుసుకోవడానికి అందరూ ఆసక్తికరంగా ఉన్నారు.
తాజా సమాచారం ప్రకారం చిరూ- బాబీ కాంబినేషన్ లో రానున్న సినిమా జనవరి 26న అధికారికంగా ప్రారంభమయ్యే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో మేకర్స్ నుంచి ఇంకా ఎలాంటి అఫీషియల్ అప్డేట్ రాలేదు కానీ త్వరలోనే దీనిపై అప్డేట్ వచ్చే వీలుంది. ఆల్రెడీ చిరూ, బాబీ కాంబినేషన్ లో గతంలో వచ్చిన వాల్తేరు వీరయ్య సూపర్ హిట్ అవడంతో ఈ మూవీ పై అందరికీ మంచి అంచనాలు నెలకొన్నాయి.






