Ram Charan: మెగా ఫ్యాన్స్ ఎదురుచూపులు ఫలించేనా?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(ram charan) ప్రస్తుతం బుచ్చిబాబు సాన(buchi babu sana) దర్శకత్వంలో పెద్ది(Peddi) అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పెద్ది సినిమా షూటింగ్ ను పూర్తి చేస్తున్న చరణ్ మార్చి 27న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు. ఆ తర్వాత చరణ్, సుకుమార్(sukumar) దర్శకత్వంలో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ సుకుమార్ ఆ సినిమా పనులతోనే బిజీగా ఉన్నాడు.
ఇదిలా ఉంటే మెగా ఫ్యాన్స్ ఎప్పట్నుంచో వెయిట్ చేస్తున్న ప్రాజెక్టు ఇప్పుడు వర్కవుట్ అవుతుందని టాలీవుడ్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. అదే రామ్ చరణ్- త్రివిక్రమ్(trivikram) కాంబినేషన్. వీరిద్దరి కలయికలో సినిమా వస్తే చూడాలని ఎంతో మంది ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. కానీ ఇప్పటివరకు వీరి కాంబినేషన్ లో సినిమా రాలేదు.
తాజా సమాచారం ప్రకారం రామ్ చరణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతుందని తెలుస్తోంది. ఆ సినిమాను పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్(Pawan kalyan creative works) బ్యానర్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నిర్మించబోతున్నారని, ఆయనతో పాటూ హారికా హాసినీ క్రియేషన్స్ బ్యానర్(Harika Haassinee Creations) కూడా మరో నిర్మాణ సంస్థగా ఉండనుందని తెలుస్తోంది. ఈ విషయం తెలిసి మెగా ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. మరి ఇందులో నిజమెంతన్నది తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు ఆగాల్సిందే.






