Samyuktha Menon: చీరకట్టు లుక్ లో ఆకట్టుకుంటున్న సంయుక్త
భీమ్లా నాయక్(Bheemla Nayak) సినిమాలో రానా(Rana)కు జోడీగా నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సంయుక్త మీనన్(Samyuktha Menon), ఆ తర్వాత పలు సినిమాలతో మెప్పించింది. గతేడాది అఖండ2(Akhanda2) లో కనిపించి తన యాక్టింగ్ తో అందరినీ ఆకట్టుకున్న సంయుక్త, తాజాగా సంక్రాంతికి శర్వానంద్(Sharwanand) తో నారీ నారీ నడుమ మురారి(Nari Nari Naduma Murari) మూవీలో హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సంయుక్త తాజాగా పట్టుచీర కట్టుకుని, మల్లెపూలు పెట్టుకుని, చేతికి సింపుల్ గా ఒక బ్యాంగిల్, రింగ్ వేసుకుని చేతిలో తామర పూలను పట్టుకుని దిగిన ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోల్లో సంయుక్త డబుల్ అందంగా ఉందని కామెంట్స్ చేస్తూ నెటిజన్లు ఆ ఫోటోలను నెట్టింట వైరల్ చేస్తున్నారు.






