BMSW: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ని బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షక మహాశయులకు కృతజ్ఞతలు: రవితేజ
మాస్ మహారాజా రవితేజ సంక్రాంతి బ్లాక్ బస్టర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. కిషోర్ తిరుమల దర్శకత్వంలో, సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ కథానాయికలుగా నటించారు. జనవరి 13న గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా సంక్రాంతి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ మీట్ నిర్వహించారు.
బ్లాక్ బస్టర్ మీట్ లో మాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ… అందరికీ హయ్. చాలా హ్యాపీగా ఉంది. ఆర్ డైరెక్టర్ ప్రకాష్, డిఓపి ప్రసాద్ తో ఎన్నో ఏళ్ళుగా వర్క్ చేస్తున్నాను. వాళ్ళతో కలిసి మరోసారి పనిచేయడం ఎంత ఆనందాన్నిచ్చింది. ప్రసాద్ సినిమాని చాలా కలర్ ఫుల్ గా తీశారు. మురళీధర్ గౌడ్ గారు అద్భుతంగా చేశారు. తన జోక్స్ కి థియేటర్స్ లో చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే కిషోర్ సత్య గెటప్ శీను వాళ్ళ అందరితో చాలా బాగా ఎంజాయ్ చేశాను. సునీల్ తో నాకు చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉంది. మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్. దుబాయ్ శీను తర్వాత మళ్లీ అంతలా ఎంజాయ్ చేశాను. ప్రతి సీను విపరీతంగా ఎంజాయ్ చేశా. తనతో మళ్ళీ మళ్ళీ ఇలాంటి సినిమాలు చేయాలని ఉంది. నిర్మాత సుధాకర్ కంగ్రాజులేషన్స్.
సినిమా చాలా అద్భుతంగా ఉంది. సంక్రాంతికి ఫుల్ ఎంటర్టైన్మెంట్. అన్ని సినిమాలతో పాటు మా సినిమా కూడా చాలా బాగుంది. ఈ సినిమాని హిట్ చేసిన ప్రేక్షక మహాశయులకు కృతజ్ఞతలు. సినిమాకి ఇంకా చాలా మంచి రన్ ఉంటుంది. డింపుల్ క్యారెక్టర్ అద్భుతంగా చేసింది. తన పాత్రకి చాలా మంచి పేరు వచ్చింది. తనకి చాలా మంచి ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఆషిక కూడా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది. అందరు కూడా కామెడీ చాలా ఆర్గానిక్ గా ఉందని చెప్తున్నారు. డైరెక్టర్ కిషోర్ కి ఆర్గానిక్ కామెడీ టైమింగ్ ఉంది. బాలు మహేంద్ర గారు, జంధ్యాల గారు, క్రేజీ మోహన్ లాంటి ఫ్లేవర్ ఉన్న రైటింగ్ తనది. తన రైటింగ్ నాకు మొదటి నుంచి చాలా ఇష్టం. ఎమోషన్ ఎంటర్టైన్మెంట్ అద్భుతంగా రాస్తాడు. ఇలాంటి సినిమా చేయాలని నాకు ఎప్పటినుంచో కోరిక. కిషోర్ సినిమాని తను అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇలాంటి సినిమాలు మళ్లీ చేయాలని కోరుకుంటున్నాను. భీమ్స్ వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు. ఈ సినిమా మెయిన్ క్రెడిట్ కిషోర్ భీమ్స్ కి ఇస్తాను. అందరికీ థాంక్యూ సో మచ్.
డైరెక్టర్ కిషోర్ తిరుమల మాట్లాడుతూ.. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సినిమాకి ఇంత పెద్ద విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షక మహాశయులందరికీ థాంక్యూ. థియేటర్ విజిట్స్ కి వెళ్ళాను.నాన్ స్టాప్ గా నవ్వుతున్నారు. ప్రతి క్యారెక్టర్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఫన్ చాలా ఆర్గానిక్ అని ఉందని చెప్తుంటే చాలా ఆనందంగా అనిపించింది. రవితేజ గారి లాంటి పెద్ద హీరోతో సినిమా చేస్తున్నప్పుడు ప్రతి క్రాఫ్ట్ ని ఎలా హ్యాండిల్ చేయాలనే ఒక టెన్సన్ ఉండేది. అయితే రవితేజ గారు ఎంతో అద్భుతంగా సపోర్ట్ చేశారు. మేము అనుకున్నది 100 కి 100% స్క్రీన్ మీద జనరేట్ అయింది. ఒకటి దర్శకుడుగా మరో అడుగు ముందుకు వెళ్ళగలిగాను. మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన రవితేజ గారికి నిర్మాత సుధాకర్ గారికి ధన్యవాదాలు. ఆ టెక్నీషియన్స్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. డింపుల్ ఆషిక సునీల్ గారు కిషోర్ గారు సత్య .. అన్ని పాత్రలు కూడా హిలేరియస్ గా వచ్చాయి. అందరూ ధియేటర్ కి వెళ్ళండి. కచ్చితంగా సినిమా చూసి ఎంజాయ్ చేస్తారు.
నిర్మాత సుధాకర్ చెరుకూరి మాట్లాడుతూ.. సంక్రాంతికి అద్భుతమైన బ్లాక్‌బస్టర్ ఇచ్చిన ఆడియన్స్ అందరికీ ధన్యవాదాలు. అన్ని వైపుల నుంచి కూడా చాలా మంచి సినిమా అని రెస్పాన్స్ వస్తోంది. ఇంత కాంపిటీషన్లో కూడా పెద్ద హిట్ ఇచ్చినందుకు తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ఇంకా చూడని వారు ఉంటే తప్పకుండా థియేటర్స్ కి వెళ్లి చూడండి. ఫుల్ ఎంటర్టైన్మెంట్. మా హీరో రవితేజ గారికి డైరెక్టర్ కిషోర్ గారికి అలాగే వెన్నెల కిషోర్ గారికి సునీల్ అన్నకి అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.
హీరోయిన్ డింపుల్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఈ సంక్రాంతి సక్సెస్ మీట్ మాకు ఎంతో స్పెషల్. ఇందులో చేసిన బాలమణి క్యారెక్టర్ నాకు చాలా స్పెషల్. అందరూ కూడా ఆ క్యారెక్టర్ తో రిలేట్ అవుతున్నారు. కిషోర్ గారు అద్భుతంగా ఆ క్యారెక్టర్ని రాశారు. రవితేజ గారితో ఇది నాకు రెండో సినిమా. నేను ఆయనకి పెద్ద ఫ్యాన్ ని. నా ఫస్ట్ హీరో, ఫస్ట్ హిట్. ఇది ఎప్పటికీ స్పెషల్ గా ఉంటుంది. అది కూడా సంక్రాంతికి రావడం ఇంకా సంతోషాన్ని కలిగించింది. ఆడియన్స్ సినిమాని చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమాకి పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.
సునీల్ మాట్లాడుతూ.. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సినిమాని ఇంత అద్భుతంగా ఆదరించిన ప్రేక్షకులు అందరికీ థాంక్స్. ఈ సంక్రాంతికి నలుగురు నవ్వించే అవకాశం ఈ సినిమాలో నాకు వచ్చింది. రవితేజ గారితో నాకు ఎప్పటినుంచో చాలా మంచి ఫ్రెండ్షిప్. తను అద్భుతమైన వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఆయన ఎవరి టైం వేస్ట్ చేయరు. ఆయన మోస్ట్ ఒరిజినల్ హ్యూమన్ బీయింగ్. ఆయన ఎనర్జీ ఎవరూ టచ్ చేయలేరు. చాలా రోజుల తర్వాత నా కామెడీని విపరీతంగా ఎంజాయ్ చేసామని నా ఫ్రెండ్స్ భీమవరం నుంచి ఫోన్ చేసి చెప్పారు. సుధాకర్ గారు చాలా మంచి ప్రొడ్యూసర్. ఆయనకి ఎప్పుడూ మంచి పేరు డబ్బులు రావాలని కోరుకుంటాను. రవితేజ గారు రేస్ కారు. ఆ రేస్ ని ఫ్యామిలీ ట్రాక్ లో పెట్టి డైరెక్టర్ కిషోర్ తిరుమల అద్భుతమైన విజయాన్ని అందించారు. ఈ వేడుకలో మూవీ యూనిట్ అందరూ పాల్గొన్నారు.






