Tamannaah: తమన్నా ఐటెం సాంగ్ కు 1 బిలియన్ వ్యూస్
మిల్కీ బ్యూటీ తమన్నా(Tamannaah) క్రేజ్, ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పే పన్లేదు. ఓ వైపు హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే మరోవైపు వేరే సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేస్తూ తన క్రేజ్ ను దేశ వ్యాప్తంగా పెంచుకుంటూ పోతుంది తమన్నా. ఇప్పటికే పలు ఐటెం సాంగ్స్ లో నటించిన తమన్నా, స్పెషల్ సాంగ్స్ కు కేరాఫ్ గా మారిపోయింది. తమన్నా స్పెషల్ సాంగ్ చేసిందంటే ఆ సాంగ్ సూపర్ హిట్టే అనే రేంజ్ లోకి అమ్మడి రేంజ్ మారింది.
2024లో వచ్చిన స్త్రీ2(Stree2)లో తమన్నా ఆజ్ కీ రాత్(Aaj ki raat) అనే స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సాంగ్ ఎంతో పాపులరైంది. ఇంకా చెప్పాలంటే ఆ సాంగ్ వల్ల సినిమా నెక్ట్స్ లెవెల్ కలెక్షన్లను అందుకుంది. తాజాగా ఈ సాంగ్ యూట్యూబ్ లో ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఆజ్ కీ రాత్ సాంగ్ ఏకంగా 100 కోట్ల వ్యూస్ ను క్రాస్ చేసింది.
ఈ సందర్భంగా తమన్నా సోషల్ మీడియాలో తన ఆనందాన్ని పంచుకుంటూ ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోలో సాంగ్ షూటింగ్ తాలూకా బిహైండ్ ది సీన్స్ క్లిప్స్ ను షేర్ చేస్తూ, ఈ సాంగ్ మొదటి వ్యూ నుంచి 1 బిలియన్ వ్యూస్ వరకు ఎంతో ప్రేమ కురిపించినందుకు అందరికీ తమన్నా థ్యాంక్స్ చెప్పింది. అమర్ కౌశిక్(Amar Kaushik) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రాజ్ కుమార్ రావు(Raj Kumar Rao), శ్రద్ధా కపూర్(Shraddha Kapoor) జంటగా నటించారు.
https://www.instagram.com/p/DTkVuqPDLhE/?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==






