Mahesh Babu: మహేష్ అల్లరిని రివీల్ చేసిన గుణశేఖర్
సూపర్ స్టార్ మహేష్ బాబు(mahesh babu) బయట ఎంత సైలెంట్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ ఆయనతో కలిసి వర్క్ చేసిన వాళ్లు మాత్రం మహేష్ గురించి, ఆయన సెన్సాఫ్ హ్యూమర్ గురించి, అల్లరి గురించి తెగ చెప్తూ ఉంటారు. అందులో భాగంగానే ఇప్పుడు టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ గుణశేఖర్(Guna sekhar) కూడా మహేష్ చేసిన ఓ అల్లరి పని గురించి బయటపెట్టాడు.
మహేష్ తో కలిసి గుణశేఖర్ మూడు సినిమాలు చేశాడు. అర్జున్(Arjun), ఒక్కడు(Okkadu), సైనికుడు(Sainikudu) అనే మూడు సినిమాలు చేయగా వాటిలో ఒక్కడు సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. సీరియస్ గా సాగే సినిమాలో అందర్నీ కడుపుబ్బా నవ్వించే సీన్ ఒకటి ఉంటుంది. అదే పాస్పోర్ట్ ఆఫీసర్ అయిన ధర్మవరపు(dharmavarapu) కు ఫోన్ చేసి విసిగించే సీన్. కొత్తగా మొబైల్ కొన్న ధర్మవరపు తన ప్రియురాలికి ఫోన్ నెంబర్ చెప్పడం విని, ఆ నెంబర్ కు ఫోన్ చేసి మహేష్ అతని ఫ్రెండ్స్ ధర్మవరపును ఓ ఆట ఆడుకుంటారు.
సినిమాలో ఆ సీన్ ఏ రేంజ్ లో పేలిందో తెలిసిందే. అయితే సినిమాలో ధర్మవరపు చెప్పే మొబైల్ నెంబర్ ఎవరిదో కాదట, నిర్మాత ఎంఎస్ రాజు(MS Raju)దేనట. ఆ నెంబర్ సినిమాలో పెట్టమని చెప్పింది స్వయంగా మహేష్ బాబేనట. నిర్మాత నెంబర్ పెడితే సినిమా రిలీజ్ తర్వాత అతనికి ఇబ్బందవుతుందని గుణశేఖర్ చెప్పినా మహేష్ వినలేదట. ఏం కాదులే అప్పుడు చూసుకుందామని చెప్పి ఆ నెంబరునే వాడారని, తీరా సినిమా రిలీజ్ తర్వాత ఎంఎస్ రాజుకి మహేష్ ఫ్యాన్స్ నుంచి ఎడతెరిపి లేకుండా ఫోన్స్ వచ్చాయని గుణశేఖర్ చెప్పాడు. ఈ విషయం తెలుసుకున్న మహేష్ అభిమానులు తమ హీరో అల్లరికి ఆశ్చర్యపోతున్నారు.






