Euphoria: ఫిబ్రవరి 6న ఒక స్పెషల్ మూమెంట్‌గా వస్తోన్న ‘యుఫోరియా’ : గుణ శేఖర్
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందించిన లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ హ్యాండ్ మేడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నీలిమ గుణ, యుక్తా గుణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నూతన నటీనటులతో గుణ శేఖర్ నేటి యూత్‌కి, ఫ్యామిలీ ఆడియెన్స్‌కి కనెక్ట్ అయ్యేలా వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో భూమిక చావ్లా, గౌతమ్ వాసుదేవ్ మీనన్, సారా అర్జున్, నాజర్, రోహిత్, విఘ్నేష్ గవిరెడ్డి, లిఖిత యలమంచలి, అడ్డాల పృధ్వీరాజ్, కల్పలత, సాయి శ్రీనికా రెడ్డి, అశ్రిత వేముగంటి, మాథ్యూ వర్గీస్, ఆదర్శ్ బాలకృష్ణ, రవి ప్రకాష్, నవీనా రెడ్డి, లికిత్ నాయుడు వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన టీజర్, గ్లింప్స్, ఫ్లై హై పాటకు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఫిబ్రవరి 6న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ చిత్రం నుంచి తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇటీవల ‘ధురంధర్’ చిత్రంతో హీరోయిన్గా ఆకట్టుకున్న సారా అర్జున్ ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తుండటం విశేషం. సమాజంలో యువతను పట్టిపీడిస్తున్న డ్రగ్స్ సమస్యలు, క్రైమ్ నేపథ్యంతో చాలా రా అండ్ ఇంటెన్స్‌గా గుణశేఖర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ప్రస్తుత సమాజంలోని వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టేలా, డ్రగ్స్ మత్తులో యువత తమ జీవితాలను ఎలా చిన్నాభిన్నం చేసుకుంటున్నారనే అంశాలను ఈ చిత్రంలో చూపించబోతున్నారు.
ఈ కథ ‘సివిల్ సర్వెంట్’ కావాలని కలలు కనే ఒక సామాన్య యువతి (సారా అర్జున్) చుట్టూ తిరుగుతుంది. ఉన్నత శిఖరాలను అధిరోహించాల్సిన ఆమె జీవితం, ఒక్క రాత్రిలో తలకిందులవుతుంది. నేటి యువత మాదకద్రవ్యాల ఊబిలో చిక్కుకుని, విచక్షణ కోల్పోయి ఎలా నేరాలకు పాల్పడుతున్నారో దర్శకుడు కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఈ చిత్రంలో సీనియర్ నటి భూమిక పోషించిన పాత్ర అత్యంత ప్రాధాన్యత కలిగినది. నిందితుడైన యువకుడి తల్లిగా ఆమె నటించారు. సాధారణంగా కన్న కొడుకు తప్పు చేస్తే కప్పిపుచ్చే తల్లులను మనం చూస్తుంటాం. కానీ ఇక్కడ భూమిక తన కొడుకు చేసిన నేరాన్ని భరించలేక, బాధితురాలికి న్యాయం చేయాలని స్వయంగా హైకోర్టును ఆశ్రయిస్తుంది. “ఆమె చేసిన నేరం ఏంటి?” అనే ప్రశ్న ప్రేక్షకుల్లో ఉత్సుకతను రేకెత్తిస్తోంది. మాతృత్వానికి, నీతికి మధ్య జరిగే ఈ సంఘర్షణ సినిమాకే హైలైట్ కానుంది.
పోలీస్ కమిషనర్ జయదేవ్ నాయర్‌గా ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మేనన్ పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఈ కేసును ఛేదించే క్రమంలో ఆయన ‘పోక్సో’ చట్టాన్ని ఎలా ప్రయోగించారు? ఆధారాలను ఎలా సేకరించారు? అనే అంశాలను గుణశేఖర్ ఎంతో సహజంగా తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. నీలిమా గుణశేఖర్ నిర్మాణంలో, కాల భైరవ సంగీత సారథ్యంలో రూపొందిన ఈ చిత్రం టెక్నికల్‌గా చాలా ఉన్నతంగా ఉంది. కేవలం డ్రగ్స్ వాడకం వల్ల కలిగే నష్టాలనే కాకుండా, బాధ్యతాయుతమైన పేరెంటింగ్ ఎంత ముఖ్యమో ఈ సినిమా చెప్పబోతోంది. వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో రాబోతున్న యుఫోరియాలో గుణ శేఖర్ అసలేం చూపించబోతున్నారో చూడటానికి అందరూ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.
హైదరాబాద్‌లో నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నటుడు అడ్డాల పృధ్వీరాజ్ మాట్లాడుతూ..‘‘గుణశేఖర్ గారు యుఫోరియా కథ చెప్పినప్పుడు షాక్ అయ్యా. యంగ్ ఐడియాలజీతో చాలా టెర్రిఫిక్‌గా రాశారు. ఆయన స్టేచర్‌కు మాలాంటి కొత్తవాళ్లతో సినిమా తీయాల్సిన అవసరం లేదు. థ్యాంక్యూ సోమచ్ సర్.’’ అని తెలిపారు.
నటుడు విఘ్నేష్ గవిరెడ్డి మాట్లాడుతూ..‘‘మ్యూజిక్ చాలా బాగుంది. నేను కాలభైరవ ఫ్యాన్. నా సినిమా ఆయన సంగీతం ఇవ్వడం నాకు చాలా గర్వంగా ఉంది. ఇండస్ట్రీలోకి రావడం నాకు ఒక ఫాంటసీ. నేను యాక్టింగ్ స్కూల్లో ఉన్నప్పుడే ఛాన్స్‌లు వస్తాయా రావా అని ఉండేది. కానీ గుణశేఖర్ గారి డైరెక్షన్లో నాకు ఛాన్స్ రావడం చాలా సంతోషంగా అనిపించింది. ఆయన నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిలబెట్టుకున్నాననే అనుకుంటున్నాను. నన్ను నమ్మి నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు నిర్మాతలు నీలిమా, రాగిణి గారికి చాలా థ్యాంక్స్. ‘ధురంధర్’ బ్యూటీ సారా ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. భూమిక గారితో పని చేయడం నా అదృష్టం. ఇది టెంప్లేట్ లేని సినిమా. చాలా హానెస్ట్‌గా తీశాం. అందరికీ తప్పకుండా నచ్చుతుంది.’’ అని చెప్పారు.
నిర్మాత నీలిమ గుణ మాట్లాడుతూ..‘‘ట్రైలర్ చూశాక చాలా ఎమోషన్‌గా అనిపించింది. ఇంత ఇంపాక్ట్ ఉన్న సినిమాను తీసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇది ప్రతి ఒక్కరికీ తప్పకుండా నచ్చుతుంది.’’ అని చెప్పారు.
హీరోయిన్ సారా అర్జున్ మాట్లాడుతూ..‘‘చాలా రోజుల తర్వాత తెలుగు ఆడియన్స్ ముందు నిలబడడం స్పెషల్‌గా ఉంది. గుణశేఖర్ గారితో పని చేయడం గౌరవంగా ఉంది. అద్భుతమైన సినిమా కోసం వాళ్ల ఫ్యామిలీ మొత్తం ఎంతో కష్టపడి పని చేశారు. ఈ సినిమా తప్పకుండా అందరూ మెచ్చే సినిమా అవుతుంది.’’ అని తెలిపారు.
సీనియర్ నటి భూమిక మాట్లాడుతూ..‘‘యుఫోరియా నాకు చాలా స్పెషల్ జర్నీ. 23 ఏళ్ల తర్వాత గుణశేఖర్ గారితో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది. ఆయన ఫ్యామిలీ ఈ సినిమా కోసం 24 గంటలూ కష్టపడి పని చేశారు. ఇది నా కెరీర్లోనే స్పెషల్ సినిమా అవుతుంది. ఈ సినిమా చేస్తున్నప్పుడు నాకు నా కుమారుడు గుర్తొచ్చాడు. పిల్లలను ఎలా పెంచాలి అనేది అందరూ తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన సినిమా ఇది.’’ అని చెప్పారు.
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణశేఖర్ మాట్లాడుతూ..‘‘మా అమ్మాయి నీలిమా ఎప్పుడూ ఇంత ఎమోషన్ అవదు. కానీ ఇప్పుడు ట్రైలర్ చూసి ఎమోషన్ అయిందంటే.. ఈ కథ అంతగా ఇంపాక్ట్ చేసింది. మా కుటుంబం మొత్తం ఈ స్టోరీకి కనెక్ట్ అయింది. అలాగే మీ అందరికీ ఈ సినిమా ఎమోషన్ కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా అందరూ కొత్తవాళ్లతో చేయాలని 6 నెలలు ఆడిషన్స్ చేశాం. రియల్ ఫ్రెష్ ఫేసెస్‌తో చేశాం. టాలెంట్ చూసే అందరినీ సెలెక్ట్ చేశాం. ఆడియన్స్ ఈ క్యారెక్టర్స్‌కు సులభంగా కనెక్ట్ అవుతారు. కథలో ఎడాలసెన్స్ అనేది చాలా కీలకం. అందుకోసమే టీనేజర్స్‌ను తీసుకున్నాం. అందుకే పొన్నియన్ సెల్వన్‌లో చేసిన సారా అర్జున్ను తీసుకున్నాం. ఆమె ఉంటేనే ఈ సినిమా చేద్దామని నీలిమ అంది. కథ చెప్పగానే సారా తండ్రి రాజ్ అర్జున్ షాక్ అయ్యారు. ఇంత మంచి కథను కచ్చితంగా జనాలకు చెప్పాలి అని అన్నారు.
తల్లి పాత్రకు భూమిక అనుకోగానే నేను వద్దనన్నాను. ఆమెను తల్లి పాత్రలో చూడడం నాకు నచ్చదు. కానీ యంగ్ మదర్ కావాలని నీలిమ చెప్పడంతో ఆమెకు కథ చెప్పాము. ఒక్కడు సినిమాతో ఎంతమంచి గుర్తింపు వచ్చిందో దానికి రెట్టింపు పేరు ఈ సినిమాతో వస్తుందని చెప్పాను. ఆమె పూర్తి స్క్రిప్ట్ చదివి వెంటనే ఓకే చెప్పింది. కేవలం గ్లామర్ పాత్రలే చేస్తామని చెప్పే హీరోయిన్స్‌కు భూమిక కనువిప్పు కలిగించింది. గౌతమ్ వాసుదేవ్ మీనన్‌కు డైరెక్టర్ గానే మంచి గుర్తింపు ఉంది. ఆయన పాత్ర చాలా నేచురల్‌గా ఉంటుంది. ఆయనకు కథ చెప్పగానే ఓకే అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్‌గా కాల భైరవను అనుకున్నప్పుడు స్క్రిప్ట్ పంపిస్తే.. కీరవాణి గారి నుంచి ఫోన్ వచ్చింది. వెంటనే కలుద్దామన్నారు. ఇది చాలా అత్యవసరంగా తీయాల్సిన సినిమా అని చెప్పారు. కాల భైరవను పిలిచి ఒళ్లు దగ్గర పెట్టుకుని ఈ సినిమా చేయమని చెప్పారు. అందుకే మ్యూజిక్ ఇంత బాగా వచ్చింది. తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నాడు. పీఎస్ వినోద్, రత్నవేల్ దగ్గర పని చేసిన ప్రవీణ్‌ను సినిమాటోగ్రఫర్‌గా పరిచయం చేస్తున్నాం. అందరూ కథ వినే ఇలాంటి అద్భుతమైన సినిమాలో భాగం కావాలనుకున్నారు. 2026 చాలా నవ్వులతో స్టార్ట్ అయింది. అందుకే నెక్ట్స్ మంత్ ఫిబ్రవరి 6న ఒక స్పెషల్ మూమెంట్ కోసం మా యుఫోరియా సినిమాను తీసుకొస్తున్నాం. ఇది అందరూ కుటుంబంతో కలిసి చూడాల్సిన చిత్రం.’’ అని చెప్పారు.






