MSVPG: మన శంకర వర ప్రసాద్ గారు 5వ రోజు ఆల్-టైమ్ రికార్డ్- 226 Cr+ వరల్డ్‌వైడ్ గ్రాస్
మెగాస్టార్ చిరంజీవి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ ఈ సంక్రాంతి సీజన్లో బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం థియేటర్లను పండుగ వేడుకలుగా మార్చింది. తెలుగు రాష్ట్రాలలో భారీగా ఫ్యామిలీ ఆడియన్స్ ని అలరిస్తోంది.
మన శంకర వర ప్రసాద్ గారు 5వ రోజు ఏపీ/తెలంగాణలో పెద్ద సంఖ్యలో వసూళ్లు సాధించింది, గత రికార్డును బద్దలు కొట్టింది. పరిశ్రమలో అత్యధిక 5వ రోజు వసూళ్లు సాధించిన చిత్రంగా మన శంకర వర ప్రసాద్ గారు సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.
BookMyShowలో కేవలం ఐదు రోజుల్లో 2.5 మిలియన్లకు పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయి, ప్రపంచవ్యాప్తంగా 226 Cr+ వసూళ్లు సాధించింది.
ఆరవ, ఏడవ రోజు నెంబర్స్ కూడా భారీగా ఉండబోతున్నాయి. అద్భుతమైన మౌత్ టాక్ తో థియేటర్లు హౌస్‌ఫుల్ షోలతో సందడి చేస్తున్నాయి.






