Ghandhi Talks: ‘గాంధీ టాక్స్’ టీజర్.. జనవరి 30న థియేటర్స్‌లో సందడి చేయనున్న సైలెంట్ ఫిల్మ్
స్టోరీ టెల్లింగ్‌లో శబ్దంతో నిండిన సినిమా ప్రపంచంలోకి సైలెంట్ ఫిల్మ్‌గా రూపొందిన ‘గాంధీ టాక్స్’ టీజర్ వచ్చేసింది. ఇది నిశ్శబ్దంగానే కాదు.. ధైర్యంగా చేసిన ఓ ప్రయత్నంగా కనిపిస్తోంది. ప్రేక్షకులను ఆకట్టుకునేలా, దృష్టిని మరల్చనీయకుండా, మాటలతో పని లేకుండా రా ఎమోషన్స్‌తో, కట్టిపడేసే దృశ్యాలతో, భావోద్వేగ ప్రపంచంలోకి ఆడియెన్స్‌ను ఇది ఆహ్వానిస్తోంది.
ఒక డైలాగ్ కూడా లేకుండా రూపొందిన ఈ టీజర్ ప్రేక్షకుల మనసుల్లో అనేక ప్రశ్నలను లేవనెత్తుతుంది.ఉద్వేగ భరితమైన నిశ్శబ్దంతో కూడిన ఈ ఇంటెన్స్ విజువల్స్ మనసుల్లో ఓ సంఘర్షణను, అశాంతి, మార్పును సూచిస్తూ.. గాంధీ నిజంగా ఏదో చెప్పబోతున్నాడనే ఆసక్తిని కలిగిస్తోంది. ఈ టీజర్ మరింత ప్రభావవంతంగా ప్రతి ఫ్రేమ్‌ను గమనించేలా, భావాలను ఫీల్ అయ్యేలా చేస్తుంది.
విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అదితి రావ్ హైదరి, సిద్ధార్థ్ జాధవ్ వంటి టాలెంటెడ్ నటీనటులు ప్రధాన పాత్రల్లో నటించిన గాంధీ టాక్స్ టీజర్, మాటలు లేకుండానే భావాలను బలంగా వ్యక్తపరిచేలా వారి నటనలోని కొత్త కోణాలను ఆవిష్కరిస్తోంది. కిషోర్ పాండురంగ్ బేలేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి లెజెండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్. రెహమాన్ అందించిన భావోద్వేగభరిత సంగీతం..సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్తోంది. ప్రతి నిశ్శబ్దం, ప్రతి ఘర్షణ, చెప్పని ఆలోచనలన్నింటికీ సంగీతమే భావోద్వేగ స్వరంగా మారుతుంది.
జీ స్టూడియోస్ సమర్పణ.. క్యోరియస్ డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్, పింక్మూన్ మెటా స్టూడియోస్, మూవీ మిల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ అసోసియేషన్‌లో రూపొందిన గాంధీ టాక్స్ సంప్రదాయ సినిమాల హద్దులను ప్రశ్నిస్తూ, నిశ్శబ్దాన్నే కథనంగా అనుభవించే ఒక ధైర్యమైన, విభిన్నమైన థియేట్రికల్ అనుభవాన్ని ప్రేక్షకులకు అందించేలా హామీ ఇస్తోంది.
జనవరి 30న ‘గాంధీ టాక్స్’ చిత్రం రిలీజ్ అవుతోంది.






