Sridhar Babu: ఫిబ్రవరి 16 నుంచి 18 వరకు బయో ఏషియా సదస్సు
ఆసియాలో అత్యంత ప్రతిష్టాత్మక లైఫ్ సైన్సెస్ అండ్ హెల్త్-టెక్ సదస్సుగా పేరుగాంచిన బయోఏషియా 2026 (23వ ఎడిషన్) అధికారిక పోస్టర్‌ను తెలంగాణ రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ మరియు పరిశ్రమ వాణిజ్య శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రధాన సంజయ్‌కుమార్, తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఫౌండేషన్ సీఈఓ శక్తి ఎం నాగప్పన్ పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ పోస్టర్ ఆవిష్కరణతో 2026 ఫిబ్రవరి 16 నుంచి 18 వరకు హైదరాబాద్‌లో జరగనున్న బయో ఏషియా సదస్సు ఏర్పాట్లు అధికారికంగా ప్రారంభమయ్యాయి. గత రెండు దశాబ్దాలుగా బయోఏషియా ఆసియాలోనే ప్రముఖ లైఫ్ సైన్సెస్, బయోఫార్మా, హెల్త్-టెక్ మరియు మెడికల్ ఇన్నోవేషన్ రంగాల్లో ఆసియాలో అగ్రగామి వేదికగా ఎదిగింది.. ప్రతి ఎడిషన్‌లో ప్రపంచ స్థాయి నాయకులు, పెట్టుబడిదారులు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు మరియు విధాన నిర్ణేతలనుఒకే వేదికపైకి తీసుకువస్తోంది. అత్యాధునిక శాస్త్రీయ ప్రగతిని పంచుకుంటున్నారు. ఇదే సమయంలో హైదరాబాద్ బయోఫార్మా, వ్యాక్సిన్లు, మెడ్‌టెక్, డిజిటల్ హెల్త్ ఆవిష్కరణల గ్లోబల్ హబ్‌గా మరింత బలపరుస్తోంది. రాష్ట్రంలోని ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, నైపుణ్యంతో కూడిన శాస్త్రవేత్తల ప్రతిభ ఈ ఎదుగుదలకు పునాదిగా నిలుస్తున్నాయి.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడంలో లైఫ్ సైన్సెస్ రంగం కీలక భూమిక పోషిస్తుందని అన్నారు. బయో ఏషియా వంటి అంతర్జాతీయ సదస్సులు తెలంగాణ నాయకత్వాన్ని ప్రపంచ వేదికపై ప్రదర్శించడంతోపాటు, కొత్త భాగస్వామ్యా లు, పెట్టుబడులు, పరిశ్రమల అభివృద్ధికి కొత్త మార్గాలను సృష్టిస్తాయని పేర్కొన్నారు. బయో ఏషియా 2026తో టెక్బయో విప్లవాన్ని ముందుకు నడిపిస్తూ ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం ప్రపంచ నిపుణులను హైదరాబాద్‌లో ఒకే వేదికపైకి తీసుకు రావడం తమ లక్ష్యమని అన్నారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్‌కుమార్ మాట్లాడుతూ బయో ఏషియా 2026 స్టార్టప్‌లు, పరిశోధకులు, పరిశ్రమల నాయకులు, పాలసీ మేకర్ల మధ్య సహకారాన్ని పెంచే శక్తివంతమైన వేదికగా నిలుస్తుందని చెప్పారు. పెట్టుబడులు, భాగస్వా మ్యాలు, సాంకేతిక మార్పిడి కోసం ఈ సదస్సు కీలక అవకాశాలను అందిస్తుందని తెలిపారు. తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఫౌండేషన్ సీఈవో శక్తి నాగప్పన్ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో టెక్బయో ఆరోగ్య రంగాన్ని పూర్తిగా కొత్త దిశలోకి తీసుకెళ్తున్నదని చెప్పారు. బయాలజీ, ఏఐ, ఆటోమేషన్, డేటా కలయికతో కొత్త ఆవిష్కరణలు, పెట్టుబడులు, ప్రభావం కోసం పెద్ద అవకాశాలు వస్తున్నాయని తెలిపారు. బయో ఏషియా 2026 కేవలం చర్చల వేదికగా కాకుండా, ఆలోచనలను కార్యరూపంలోకి తీసుకువచ్చే వేదికగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
రెండు దశాబ్దాలుగా బయోఏషియా ఆసియాలోనే ప్రముఖ లైఫ్ సైన్సెస్, బయోఫార్మా, హెల్త్-టెక్, మెడికల్ ఇన్నోవేషన్ రంగాల్లో ఆసియాలో అగ్రగామి వేదికగా నిలుస్తున్నది. ప్రతి ఎడిషన్‌లో ప్రపంచస్థాయి నాయకులు, పెట్టుబడిదారులు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు, విధాన నిర్ణేతలను ఒకే వేదికపైకి తీసుకువస్తున్నది. అత్యాధునిక శాస్త్రీయ ప్రగతిని పంచుకుంటున్నారు. ఇదే సమయంలో హైదరాబాద్ బయోఫార్మా, వ్యాక్సిన్లు, మెడ్‌టెక్, డిజిటల్ హెల్త్ ఆవిష్కరణల గ్లోబల్ హబ్‌గా మరింత బలపరుస్తున్నది. రాష్ట్రంలోని ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, నైపుణ్యంతో కూడిన శాస్త్రవేత్తల ప్రతిభ ఎదుగుదలకు పునాదిగా నిలుస్తున్నాయి.
ఈసారి ఏఐ థీమ్‌తో నిర్వహణ
ఈసారి బయో ఏషియా 2026ను ‘టెక్ బయో అన్లీష్డ్: ఏఐ, ఆటోమేషన్, బయోలాజీ రెవల్యూషన్ణ అనే థీమ్‌తో నిర్వహిస్తున్నారు. ఈ థీమ్ ద్వారా బయాలజీ, డేటా, డీప్ టెక్నాలజీ కలయికతో ప్రపంచవ్యాప్తంగా ఔషధ ఆవిష్కరణలు, నిర్ధారణ పద్ధతులు, థెరపీ తయారీ, ఆరోగ్య సేవల అందజేతలో చోటుచేసుకుంటున్న విప్లవాత్మక మార్పులను ప్రతిబింబించనున్నారు. టెక్బయో వల్ల వ్యాధులను అర్థం చేసుకునే విధానం, చికిత్స, వైద్య సేవలను అందించే విధానం పూర్తిగా మార్పులు వివరించనున్నారు. దీని ఫలితంగా ఆరోగ్య సేవలు మరింత అందుబాటులో ఉండేలా మారబోతున్నాయి. అదే సమయంలో ప్రపంచ ఆరోగ్య వ్యవస్థ మరింత స్థిరంగా, సమానంగా, అందరికీ చేరువయ్యేలా రూపుదిద్దుకోనుంది. స్టార్టప్‌లు, పరిశోధకులు, పెట్టుబడిదారులు, విధానకర్తలు, అంతర్జాతీయ సంస్థలకు ఈ సదస్సులో వ్యూహాత్మక అవకాశాలు లభిస్తాయి. ప్రయోగశాలల్లో జరిగిన ఆవిష్కరణలను మార్కెట్ అవసరాలకు అనుసంధానించడానికి ఈ సదస్సు వారధిగా పనిచేస్తుంది.
బయో ఏషియా 2026 ద్వారా స్టార్టప్‌లు, పరిశోధకులు, పెట్టుబడిదారులు, విధానకర్తలు మరియు అంతర్జాతీయ సంస్థలకు వ్యూహాత్మక అవకాశాలు లభిస్తాయి. ప్రయోగశాలల్లో జరిగిన ఆవిష్కరణలను మార్కెట్ అవసరాలకు అనుసంధానించడానికి ఈ సదస్సు వారధిగా పనిచేస్తుంది. నవీన ఆవిష్కరణలను ప్రోత్సహించడంతో పాటు రోగుల భద్రత మరియు ప్రజా ప్రయోజనాలను కాపాడే విధంగా విధానాలను రూపుదిద్దేందుకు ఇది వేదికగా నిలుస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని భాగస్వాములను 2026 ఫిబ్రవరి 16–18 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే బయో ఏషియా 2026లో పాల్గొని పెట్టుబడి అవకాశాలను అన్వేషించవలసిందిగా, భాగస్వామ్యా లను బలోపేతం చేయవలసిందిగా మరియు టెక్బయో విప్లవంలో భాగస్వాములు కావలసిందిగా నిర్వాహకులు ఆహ్వానించారు.






