ఆమె పోటీ చేస్తే డిపాజిట్ దక్కదు: రాజగోపాల్ రెడ్డి
కన్న తండ్రి కేసీఆర్(KCR) ను గౌరవించని కవిత, ప్రజలకు తల్లి ఎలా అవుతుందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) ప్రశ్నించారు. భువనగిరి జిల్లా చౌటుప్పల్ (Choutuppal) లో ఆయన మాట్లాడారు. పార్టీ మొదటి సమావేశంలోనే కేసీఆర్ ను తిట్టడం ద్వారా కవిత (Kavitha) మర్యాదను పోగొట్టుకుందని అన్నారు. కవిత రాజకీయ పార్టీ పెట్టడం హాస్యాస్పదంగా ఉందని, ఇంకా చెప్పాలంటే పెద్ద జోక్ అనిపిస్తోందన్నారు. కేసీఆర్ తోనే కేటీఆర్, హరీశ్ రావు (Harish Rao), కవితలకు గుర్తింపు వచ్చిందని, కుటుంబంలోని ఆధిపత్య పోరుతోనే ఆమె బయటకు వచ్చి రాజకీయ పార్టీ పెట్టిందన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితకు ఇంకా క్లీన్ చిట్ రాలేదని గుర్తు చేశారు. కవిత పోటీ చేస్తే డిపాజిట్ కూడా రాదని జోస్యం చెప్పారు. కాగా, ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత జరిగే మంత్రివర్గ విస్తరణలో తనకు మంత్రి పదవి వస్తుందన్న నమ్మకం ఉందని తెలిపారు.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});








