దేశానికే మోడల్‌గా కొండగల్ : సీఎం రేవంత్ రెడ్డి
దేశానికే మోడల్‌గా కొడంగల్ (Kodangal)ను తీర్చిదిద్దుతున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో రూ.110 కోట్లతో నిర్మించనున్న శ్రీవేంకటేశ్వర స్వామి (Lord Venkateswara) ఆలయ పునర్నిర్మాణానికి సీఎం భూమిపూజ చేశారు. కొడంగల్ నుంచే దౌల్తాబాద్ (Daulatabad), కోస్గి (Kosgi) ఆలయాల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. లగచర్లను ఎడ్యుకేషనల్ హబ్‌గా మార్చుతున్నామని తెలిపారు. కృష్ణానదీ జలాలతో కొడంగల్ భూములు తడవాలన్నారు. కృష్ణా జలాలు ఇక్కడికి వచ్చే వరకు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి దామోదర్ రాజనర్సింహ, మంత్రి శ్రీహరిని నిద్ర పోనీయొద్దని స్థానిక నేతలకు సూచించారు. కొడంగల్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఈ నియోజకవర్గానికి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మంత్రి పదవి దక్కలేదని, ఇప్పుడు కొడంగల్ ఎమ్మెల్యే నైన తనకు సీఎం పదవి దక్కిందన్నారు.
ఇవి కూడా చదవండి








