కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నందుకే తనపై అక్రమ కేసులు : మన్నె క్రిశాంక్
కాంగ్రెస్ పార్టీ (Congress Party)ని ప్రశ్నిస్తున్నందుకే తనపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ (Manne Krishank)వ్యాఖ్యానించారు. సంగారెడ్డి జిల్లా కందిలోని సెంట్రల్ జైలు నుంచి క్రిశాంక్ విడుదలయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్ని కేసులు పెట్టినా ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. గతంలో హైదరాబాద్ (Hyderabad) (హైదరాబాద్ ) ఏటీఎం కాద్ద కాల్పులు జరిపి దొంగలు పారిపోయారని, కరీంనగర్ జ్యువెలరీ షాపు (Jewelry Shop)లో దొంగలు కాల్పులు జరిపి నగలు ఎత్తుకెళ్లారని అన్నారు. సీపీ సుమతికి అర్ధరాత్రి రక్షణ లేకుండా పోయిందని అన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ క్వార్టర్స్‌లోనే రక్షణ లేదని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలపై కాకుండా శాంతి భద్రతలపై దృష్టి సారించాలని హితవుపలికారు. మీడియా వాళ్లతో కూడా మాట్లాడితే ఎందుకు మాట్లాడావని అడుగుతున్నారన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమ ఫోన్లు ట్యాపింగ్, వైఫై హ్యాకింగ్ చేస్తుందన్న అనుమానం కలుగుతోందని పేర్కొన్నారు.








