BITS Hyderabad: బిట్స్ హైదరాబాద్ కు భూరి విరాళం
అమెరికాలో నివాసముంటున్న పూర్వవిద్యార్థులు, దంపతులైన చంద్ పి.గర్గ్ (Chand P. Garg), మంజు గర్గ్లు (Manju Garg,) రూ.36 కోట్ల (4 బిలియన్ డాలర్లు) విరాళాన్ని బిట్స్ -పిలానీ హైదరాబాద్కు (BITS Hyderabad) అందించారు. ప్రపంచవ్యాప్తంగా బిట్స్ పిలానీ (BITS Pilani)సంస్థలు అత్యున్నత ప్రమాణాలతో విద్యను అందించాలని, ఇందుకోసం 100 మిలియన్ డాలర్ల ధార్మిక నిధిని సమీకరించుకోవాలని బిట్స్ కార్యవర్గం 18 నెలల క్రితం నిర్ణయించింది. ఇందుకోసం పూర్వ విద్యార్థులు తమవంతు సహకరించాలంటూ వెబ్సైట్ ద్వారా అభ్యర్థించారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో నివాసముంటున్న పూర్వవిద్యార్థులు, స్వదేశంలో ఉంటున్నవారు కలిసి ఇప్పటివరకు 34 మిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
తాజాగా అమెరికాలో ఉంటున్న చంద్ గర్గ్ దంపతులు నాలుగు మిలియన్ డాలర్ల విరాళాన్ని బిట్స్ హైదరాబాద్కు పంపించారు. వీరిద్దరూ బిట్స్ పిలానీలో 1968లో మెకానికల్ ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తి చేశారు. అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఇంటర్నేషనల్ ట్రేడ్, క్రెడిట్స్ వ్యాపారం చేస్తున్నారు. భూరి విరాళం అందించిన చంద్ దంపతులను బిట్స్ పిలానీ వీసీ వి.రామ్గోపాల్ (VC V. Ramgopal) అభినందించారు.






