రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ఎస్ఐపీబీ ఆమోదం … కీలక నిర్ణయాలివే
రాష్ట్రాన్ని పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా మరో భారీ అడుగు పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అధ్యక్షతన జరిగిన 17వ ఎస్ఐపీబీ (SIPB) సమావేశంలో రూ.2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు ఆమోదం తెలపగా, వీటి ద్వారా దాదాపు 39 వేల మందికి ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. విశాఖలో రిలయన్స్ డేటా సెంటర్ (Reliance Data Center) కు గ్రీన్ సిగ్నల్ తో పాటు శక్తి, పరిశ్రమలు, ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో విస్తృత ప్రాజెక్టులు ముందుకు వచ్చాయి. అనుమతుల నుంచి ప్రారంభోత్సవం వరకు ప్రతి దశలో వేగం, పారదర్శకతతో ఏపీకి ప్రత్యేక బ్రాండ్ తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో 25 ప్రాజెక్టులకు సంబంధించిన భారీ పెట్టుబడులకు కీలక నిర్ణయాలు తీసుకుంది. విశాఖలో రిలయన్స్ సంస్థ రూ.1,08,010 కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. సత్యసాయి జిల్లా (Satyasai District)లో రూ.51 వేల కోట్లతో సోలార్ పవర్ ప్లాంట్ను, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టంను కూడా రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేయనుంది. కడపలో రూ.12 వేల కోట్లతో అదానీ హైడ్రో ఎనర్జీ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టును, తిరుపతిలో రూ.2,500 కోట్లతో రాయల్ ఎన్ఫీల్డ్ మోటర్ సైకిల్ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది.
ఇవి కూడా చదవండి








