టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేశ్ ప్రమాణ స్వీకారం
తెలుగుదేశం పార్టీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. మంగళగిరి (Mangalagiri)లోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ప్రమాణ స్వీకారం చేయించారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) బాధ్యతలు తీసుకున్నారు. పొలిట్ బ్యూరో (Politburo) , జాతీయ, రాష్ట్ర కమిటీలతో చంద్రబాబు ప్రమాణం చేయించారు. పాత, కొత్త కలయికతో కమిటీలను పార్టీ అధినాయకత్వం ఏర్పాటు చేసింది. పార్టీ చరిత్రలో తొలిసొరిగా మండల, క్లస్టర్ స్థాయి నేతలకు పొలిట్ బ్యూరోలో చోటు దక్కింది.
నారా లోకేష్, నూతన కార్యవర్గ కమిటీ సభ్యులతో ప్రమాణం చేయించిన పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు. 252 మందితో తెలుగుదేశం పార్టీ నూతన కార్యవర్గం ఏర్పాటు. అంతకుముందు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్, ఇతర కార్యవర్గ సభ్యులు.

నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవం సందర్భంగా పార్టీ కార్యాలయానికి పెద్దఎత్తున తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో సందడిగా మారిన తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});








