జబల్ పూర్ పడవ బోల్తా ఘటనపై తాజాగా ఓ వీడియో వైరల్
మధ్యప్రదేశ్ లోని జబల్ పుర్ జిల్లాలో నర్మదా నదిపై వున్న బర్గీ జలాశంయంలో పడవ బోల్తా ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. మరీ ముఖ్యంగా ఓ తల్లి తన చంటి పిల్లాడితో వున్న ఫొటో వైరల్ అవుతోంది. అయితే తాజాగా దీనికి సంబంధించిన ఒకటి వైరల్ అవుతోంది. ఈ ప్రమాదం జరగడానికి కొన్ని క్షణాల ముందు ప్రయాణికులందరూ హాహాకారాలు చేస్తున్న వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. బూటులోకి నీరు వస్తుండటంతో ప్రయాణికులు అందరూ భయాందోళనకు గురైన విషయాలు ఇందులో కనిపిస్తున్నాయి. బూటు భారీ కుదుపులకు గురైన సమయంలో సిబ్బంది ప్రయాణికులకు లైఫ్ జాకెట్లు ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈదురు గాలులు, బలమైన నదీ ప్రవాహాల మధ్య పడవ అదుపు తప్పి కొట్టుమిట్టాడుతున్న దృశ్యం అలాంటి ఒక వీడియోలో కనిపిస్తుంది.అలాగే ఆ పడవ కేవలం కొన్ని నిమిషాల్లోనే పూర్తిగా మునిగిపోవడం ఆ వీడియోలో కనిపిస్తోంది.
క్రూయిజ్ బోటు బోల్తా పడటానికి కొద్ది క్షణాల ముందు రికార్డ్ చేయబడిన మరో వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలో పర్యాటకులు చల్లని వాతావరణాన్ని, బలమైన గాలులను ఆస్వాదిస్తూ కనిపిస్తున్నారు. బోటులో ఉన్నవారికి సమీపంలో పొంచి ఉన్న ప్రమాదం గురించి ఏమాత్రం పసిగట్టలేకపోయారు.
జబల్ పూర్ లోని బర్గి డ్యామ్ లో గురువారం సాయంత్రం పడవ బోల్తా పడి, గల్లంతైన ఘటన వెలుగులోకి వచ్చింది. బర్గి డ్యామ్ రిజర్వాయర్ లో గురువారం సాయంత్రం 29 మంది ప్రయాణికులు, ఇద్దరు సిబ్బందితో వెళ్తున్న బోట్ ప్రమాదానికి గురైంది. ప్రతికూల వాతావరణం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు అంటున్నారు. బలమైన గాలుల వల్ల రిజర్వాయర్ లోని నీరుతోనే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు అంటున్నారు. ఈ సమయంలోనే బోటును వెనక్కి తిప్పాలని కొందరు ప్రయాణికులు కోరినా.. సిబ్బంది ఏమీ స్పందించలేదన్న ఆరోపణలు కూడా వున్నాయి.
చివరికి బోటు ప్రమాదానికి గురవుతున్న సమయంలో ఓ తల్లి తన కన్న కొడుకును కాపాడేందుకు చివరి వరకూ తల్లడిల్లింది.అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా తన కుమారుడ్ని కాపాడుకోవడానికి శతధా ప్రయత్నాలు చేసింది.కానీ ఆమె పోరాటం మాత్రం ఫలించలేదు. దీనికి సంబంధించిన ఫొటో ఒకటి వైరల్ అవుతోంది. ఈ దృశ్యం అందర్నీ కంటతడి పెట్టిస్తోంది.








