జీ తెలుగు సరిగమప: ఇండియాస్ నెక్ట్స్ సింగింగ్ సెన్సేషన్ ఆడిషన్స్..బెంగళూరులో!
తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని పంచడంలో ముందుండే ఛానల్ జీ తెలుగు. అంతులేని వినోదంతోబుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూనే ‘సరిగమప’ ద్వారా ప్రతిభావంతులను వెలికితీయడంలోనూ ప్రముఖ పాత్ర పోషిస్తోంది. జీ తెలుగు నిర్వహిస్తున్న పాపులర్ సింగింగ్ షో సరిగమప ఎంతోమంది గాయనీ గాయకులను ప్రేక్షకులకు పరిచయం చేసింది. విజయవంతంగా 17 సీజన్లు పూర్తి చూసుకున్న జీ తెలుగు తదుపరి సీజన్ ‘సరిగమప-ఇండియాస్ నెక్ట్స్ సింగింగ్ సెన్సేషన్’ ను ఘనంగా ప్రారంభించడానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా విస్తృతంగా ఆడిషన్స్ నిర్వహిస్తోంది. ప్రతిభావంతులైన గాయనీగాయకులు జీ తెలుగు అందిస్తున్న ఈ సువర్ణావకాశాన్ని అందిపుచ్చుకోండి.
జీ తెలుగు సరిగమపతదుపరిసీజన్ కోసంతెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలు పట్టణాల్లో ఆడిషన్స్ నిర్వహిస్తోంది. ప్రతిభను ప్రోత్సహిస్తూ మట్టిలోని మాణిక్యాలను వెలికితీసేందుకు ఈ ఆదివారం బెంగళూరులో ఆడిషన్స్ నిర్వహిస్తోంది. 18-35 సంవత్సరాల వయసు గల గాయనీగాయకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ప్రతిభను నిరూపించుకోవచ్చు.
సరిగమప-ఇండియస్ నెక్ట్స్ సింగింగ్ సెన్సేషన్ ఆడిషన్స్ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జరుగుతాయి. జూన్ 28, ఆదివారం, బెంగళూరులోని అబ్బయ్య నాయుడు స్టూడియో (మధు ఆర్ట్ స్టూడియో), 134, 7వ క్రాస్ రోడ్, నాయుడు లేఅవుట్, చిక్కల్సాంద్ర, కర్ణాటక, 560061నందు ఆడిషన్స్ జరగనున్నాయి. ఆసక్తి గలవారు జీ తెలుగు అందిస్తున్న ఈ గోల్డెన్ ఛాన్స్‌ని మిస్ కావద్దు!
ఇంకెందుకు ఆలస్యం.. జీ తెలుగు ‘సరిగమప-ఇండియాస్ నెక్ట్స్ సింగింగ్ సెన్సేషన్’ టైటిల్ కోసం మీరూ పోటీపడండి!








