విశాఖలో ‘మాస్టర్ కార్డ్’ టెక్నాలజీ సెంటర్!

విశాఖలో ‘మాస్టర్ కార్డ్’ టెక్నాలజీ సెంటర్!

19-04-2017

విశాఖలో ‘మాస్టర్ కార్డ్’ టెక్నాలజీ సెంటర్!

విశాఖలోని ఫిన్‌టెక్ కేంద్రంలో టెక్నాలజీ సెంటర్‌ ఏర్పాటు చేసేందుకు ‘మాస్టర్ కార్డ్’ సానుకూలత వ్యక్తం చేసింది. విశాఖలో టెక్నాలజీ సెంటర్ నెలకొల్పాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనకు స్పందించిన ఆ సంస్థ ఇంటర్నేషనల్ మార్కెట్స్ ప్రెసిడెంట్ ఏన్ కేన్స్ తమ సంస్థ ఆసియా కార్యకలాపాల విభాగాధిపతికి ఈ ప్రతిపాదన తెలియజేసి, తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు.  డిజిటల్ చెల్లింపుల విధానంలో ప్రపంచవ్యాప్తంగా అమలులోవున్న ఉత్తమ పద్ధతుల గురించి ఏపీ ప్రభుత్వంతో పాలుపంచుకుంటామని ఏన్ కేన్స్ అభిలాష వ్యక్తం చేశారు. చిన్నతరహా వ్యాపారులు, వినియోగదారులకు అందుబాటులో వుండేలా మాస్టర్ కార్డు ద్వారా సాంకేతికతను ఎలా అభివృద్ధి చేస్తున్నది ముఖ్యమంత్రికి వివరించారు. ప్రస్తుతం 200పైగా దేశాలలో ‘మాస్టర్ కార్డు’ తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది.


Click here for Photogallery