ASBL NSL Infratech

రేవంత్, షర్మిల వెనుక కర్త, కర్మ, క్రియ చంద్రబాబే.. జగన్

రేవంత్, షర్మిల వెనుక కర్త, కర్మ, క్రియ చంద్రబాబే.. జగన్

ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మునుపెన్నడు చూడని కుటుంబ రాజకీయాలు  బయటికి వస్తున్నాయి. ప్రస్తుత ఆంధ్రలో పోటాపోటీగా దిగుతున్న పార్టీల విషయానికి వస్తే టీడీపీ, జనసేనకు తమ కుటుంబాల అండ పుష్టిగా ఉంది. నారా చంద్రబాబునాయుడు కోసం నారా కుటుంబంతో పాటు నందమూరి కుటుంబంలో కూడా రంగంలోకి దిగుతుంది. ఇటు పవన్ కోసం మెగా కుటుంబం ఉండనే ఉంది. ఎటోచ్చి ఒంటరి పోరాటం జగన్ కి మాత్రమే దక్కుతోంది. అండగా రావలసిన అక్కచెల్లెళ్లు ఆడిపోసుకుంటుంటే.. ఈ విషయంపై ప్రతిపక్షాలు గోల పెడుతుంటే.. ప్రజలనే అండదండగా నమ్ముకొని ముందుకు వెళ్తున్నాడు జగన్. ఈ నేపథ్యంలో తన సోదరి షర్మిల తో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కూడా జగన్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. పేరుకు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి.. చంద్రబాబు నాయుడు శిష్యుడు అన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే పక్కా తెలుగుదేశంకు సపోర్ట్ ఇస్తూ రేవంత్ రెడ్డి ఎన్నో సందర్భాలలో జగన్ గురించి వ్యతిరేకంగా మాట్లాడారు. దీనిపై తాజాగా స్పందించిన జగన్ ఈ ఇద్దరినీ వెనకుండి నడిపిస్తున్నది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అని తేల్చి చెప్పారు. చంద్రబాబు నాయుడు చేతిలో ఈ ఇద్దరి రిమోట్ ఉందని జగన్ స్పష్టం చేశారు. ఒక టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన జగన్.. కడప ఎంపీ స్థానం నుంచి షర్మిల పోటీ చేయడంపై తనకు ఎటువంటి బాధ లేదని.. అయితే ఆమెకు డిపాజిట్ కూడా రాదేమో అని తాను భయపడుతున్నానని పేర్కొన్నారు. అంతేకాదు తనపై నమోదైనటువంటి అక్రమ ఆస్తుల కేసులో అన్యాయంగా తన తండ్రి పేరు చేర్చిన కాంగ్రెస్ పార్టీకు షర్మిల మద్దతు ఇవ్వడం ఎంతో ఆవేదన కలిగిస్తుందని చెప్పారు.



praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :